WhatsApp Accounts Banned: వాట్సాప్‌ సంచలన నిర్ణయం.. ఏప్రిల్‌ నెలలో 16 లక్షల అకౌంట్లు బ్యాన్‌.. ఎందుకంటే..!

WhatsApp Accounts Banned: వాట్సాప్‌.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాట్సాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోని..

WhatsApp Accounts Banned: వాట్సాప్‌ సంచలన నిర్ణయం.. ఏప్రిల్‌ నెలలో 16 లక్షల అకౌంట్లు బ్యాన్‌.. ఎందుకంటే..!

Updated on: Jun 01, 2022 | 9:08 PM

WhatsApp Accounts Banned: వాట్సాప్‌.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాట్సాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోని మునిగి తేలుతుంటారు. అయితే ప్రతి నెల లక్షల కొద్ది అకౌంట్లను బ్యాన్‌ చేస్తోంది వాట్సాప్‌ సంస్థ. ఇక ఏప్రిల్ నెలలో మొత్తమ్మీద 16 లక్షలపైగా వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న డిజిటల్ కంపెనీలు ఈ వివరాలను ప్రతి నెలా ప్రచురించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలకు సంబంధించిన వివరాలను వాట్సాప్ వెల్లడించింది.

వాట్సాప్‌ గ్రూపులలో అసభ్యరమైన పోస్టులు, ఫోటోలు,నిబంధనలు పాటించకపోవడం వల్ల సంస్థ ప్రతి నెల వాట్సాప్‌ అకౌంట్లను తొలగిస్తుంది. తాము ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ సేవల్లో తాము ఇండస్ట్రీ లీడర్‌గా ఉన్నామని వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. ఈ క్రమంలోనే వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, అనలిస్టులు, రీసెర్చర్లు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిపుణులు, ఆన్‌లైన్ సేఫ్టి, టెక్నాలజీ డెవలప్‌మెంట్ నిపుణులతో కూడి బృందాలను నియమించామని తెలిపారు.

యూజర్లకు ఇబ్బందికరమైన కంటెంట్‌ ఉండటం వల్ల వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతుండటంతో వాట్సాప్‌ సంస్థ ఈ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తమకు ఫిర్యాదులు అందిన పలు వాట్సాప్ ఖాతాలను కూడా బ్యాన్ చేశామని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి