Whatsapp AI: వాట్సాప్‌లో కొత్త ఫీచర్! ఏఐతో స్టేటస్ పెట్టొచ్చు! ప్రాసెస్ ఎలాగంటే..

ఏఐతో ఫొటోస్ జనరేట్ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఫొటోలు క్రియేట్ చేసేందుకు చాలా ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా వాట్సాప్ కూడా ఈ ట్రెండ్ లో చేరింది. ఏఐ ద్వారా వాట్సాప్ స్టేటస్ లు క్రియేట్ చేసుకునేవిధంగా కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇది ఎలా పని చేస్తుందంటే..

Whatsapp AI: వాట్సాప్‌లో కొత్త ఫీచర్! ఏఐతో స్టేటస్ పెట్టొచ్చు! ప్రాసెస్ ఎలాగంటే..
Whatsapp Ai

Updated on: Oct 24, 2025 | 12:29 PM

వాట్సాప్ లో చాలామంది స్టేటస్ లు పెడుతుంటారు. అయితే ఇకపై స్టేటస్ కోసం ఎక్కడెక్కడో వెతక్కుండా ఏఐతో మీకు కావల్సిన స్టేటస్ పోస్టులను వాట్సాప్ లోనే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికై కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఏఐతో ఫొటోలు క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ట్రెండ్ ప్రస్తుతం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫీచర్ రాకతో ఇకపై వాట్సాప్ స్టేటస్ ల్లో కూడా ఏఐ ఇమేజ్ లు కనిపించనున్నాయి. వాట్సాప్ లో రాబొతున్న ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాసెస్ ఇలా..

వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్ సాయంతో మీకు కావాల్సిన ఐడియాను టైప్ చేసి ఫొటో రూపంలో పొందొచ్చు. ముందుగా మీరు ఫొటో ఐడియాకు సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి. అప్పుడు ఫొటో జనరేట్ అవుతుంది. యూజర్లు దాన్ని స్టేటస్ గా పెట్టుకోవచ్చు.

  • ముందుగా వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేయాలి. తర్వాత యాప్ ఓపెన్ చేసి స్టేటస్ ట్యాబ్‌కి వెళ్లాలి
  • అక్కడ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తున్న AI ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • అప్పుడు టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కావాల్సిన ఫొటో ప్రాంప్ట్ ఇవ్వాలి.
  • అప్పుడు మెటా AI ఆధారంగా క్రియేట్ అయిన  ఫొటోలు మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన ఫొటో ఎంచుకంటే అది స్టేటస్ గా పోస్ట్ అవుతుంది.
  • ఒకవేళ మీకు ఫొటోలు నచ్చకపోతే మీరు ప్రాంప్ట్ లో మార్పులు చేయొచ్చు.
  • ఇకపోతే మీ దగ్గర ఉన్న ఫొటోలను అప్ లోడ్ చేసి వాటిని ఏఐతో రీక్రియేట్ చేయొచ్చు. అలాగే ఫొటోపై స్టిక్కర్ లేదా టెక్స్ట్ వంటి ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..