AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్‌ ఆదా చేస్తూ.. బైక్‌ మైలేజ్ పెంచాలంటే ఎంత స్పీడ్‌లో నడపాలి? సూపర్‌ టిప్స్‌!

పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బైక్ మైలేజ్‌పై వాహనదారులు దృష్టి పెడుతున్నారు. నిపుణుల ప్రకారం, గంటకు 40–60 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపడం, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం, టైర్లలో సరైన గాలి ఒత్తిడి ఉంచడం వంటి అలవాట్లు ఇంధన వినియోగాన్ని తగ్గించి మైలేజ్‌ను పెంచుతాయి.

పెట్రోల్‌ ఆదా చేస్తూ.. బైక్‌ మైలేజ్ పెంచాలంటే ఎంత స్పీడ్‌లో నడపాలి? సూపర్‌ టిప్స్‌!
Bike Mileage Tips
SN Pasha
|

Updated on: May 20, 2026 | 11:20 PM

Share

దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇప్పుడు మైలేజ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా రోజూ బైక్‌పై ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఆటోమొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బైక్‌ను సరైన వేగంతో నడపడం ద్వారా గణనీయంగా పెట్రోల్ ఆదా చేయవచ్చు. సాధారణంగా ఎక్కువ శాతం మోటార్‌సైకిళ్లు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం మధ్య నడిపితే ఉత్తమ మైలేజ్ ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ వేగంలో ఇంజిన్‌పై ఒత్తిడి తక్కువగా ఉండటంతో పాటు ఇంధన వినియోగం కూడా నియంత్రణలో ఉంటుంది. అధిక వేగంతో ముఖ్యంగా 80 కిలోమీటర్లకు పైగా బైక్ నడిపితే పెట్రోల్ వినియోగం వేగంగా పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, వేగంగా యాక్సిలరేట్ చేయడం కూడా మైలేజ్‌ను తగ్గిస్తాయి. స్థిరమైన వేగంతో బైక్ నడపడం ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బైక్ నిర్వహణ కూడా మైలేజ్‌పై కీలక ప్రభావం చూపుతుంది.

  • టైర్లలో సరైన గాలి ఒత్తిడి ఉండటం చాలా ముఖ్యం. గాలి తక్కువగా ఉంటే ఇంజిన్‌పై అదనపు భారం పడుతూ పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుంది.
  • అలాగే ఇంజిన్ ఆయిల్‌ను సమయానికి మార్చడం.
  • ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రంగా ఉంచడం ద్వారా కూడా మైలేజ్ మెరుగుపడుతుంది.
  • ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎక్కువసేపు ఆగాల్సి వస్తే ఇంజిన్‌ను ఆఫ్ చేయడం ద్వారా కూడా ఇంధనం ఆదా చేయవచ్చు.
  • అవసరం లేకుండా క్లచ్‌పై చేయి ఉంచడం, హాఫ్ క్లచ్‌లో బైక్ నడపడం వంటి అలవాట్లు పెట్రోల్ వినియోగాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
  • అదనపు బరువుతో ప్రయాణించడం, అవసరం లేని మోడిఫికేషన్లు చేయడం కూడా మైలేజ్‌ను ప్రభావితం చేస్తాయి.
  • సరైన వేగం, క్రమమైన సర్వీసింగ్‌, జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే బైక్ మైలేజ్‌ను గణనీయంగా పెంచుకోవచ్చని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us