AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup: వరల్డ్‌ కప్‌ ప్రేక్షకుల కోసం అదిరిపోయే ఆఫర్‌.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై స్పెషల్‌ ఆఫర్స్‌

ఈసారి వరల్డ్‌ కప్‌ను ప్రముఖ ఈ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికాం కంపెనీలన్నీ సరికొత్త ఆఫర్స్‌ను అందిస్తున్నాయి. ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌తో యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, జియో వంటి కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్‌ను ప్రకటించగా తాజాగా వొడాఫోన్‌ ఐడియా (VI) సైతం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. వరల్డ్ కప్‌ వీక్షించేందుకు గాను తీసుకొచ్చిన...

World Cup: వరల్డ్‌ కప్‌ ప్రేక్షకుల కోసం అదిరిపోయే ఆఫర్‌.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై స్పెషల్‌ ఆఫర్స్‌
World Cup Ott Plans
Narender Vaitla
|

Updated on: Oct 08, 2023 | 3:46 PM

Share

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచ కప్‌ 2023 ఫీవర్‌ నడుస్తోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ద్వారా భారత్‌ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతోంది. దీంతో క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. అయితే ఒకప్పుడు కేవలం టీవీలకే పరిమితమైన క్రికెట్‌ మ్యాచ్‌లు ఇప్పుడు చేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్స్‌లోనూ హంగామా చేస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ భారీ మొత్తానికి స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేస్తున్నాయి.

ఈసారి వరల్డ్‌ కప్‌ను ప్రముఖ ఈ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికాం కంపెనీలన్నీ సరికొత్త ఆఫర్స్‌ను అందిస్తున్నాయి. ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌తో యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, జియో వంటి కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్‌ను ప్రకటించగా తాజాగా వొడాఫోన్‌ ఐడియా (VI) సైతం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. వరల్డ్ కప్‌ వీక్షించేందుకు గాను తీసుకొచ్చిన ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరలు మీకోసం..

రూ. 839తో రీఛార్జ్‌ చేసుకుంటే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. 3 నెలల వ్యాలిడిటీతో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యాప్‌ను ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు వొడాఫోన్‌ఐడియా రూ. 181 ప్రత్యేక ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రోజూ 2 జీబీ డేటాను పొందొచ్చు. ఇక రూ. 418 ప్లాన్‌పై కూడా వీఐ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్‌ను రూ. 30 తగ్గింపుతో అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకునే 56 రోజులకు గాను 100 జీబీ డేటా పొందొచ్చు. ఇక వీఐ ఆఫర్స్‌ ఇక్కడితోనే ఆగిపోలేవు. వీఐ యాప్‌లో కూపన్‌ కోడ్‌ లేదా, వెబ్‌ పోర్టల్‌లో ఫ్యాన్‌ కోడ్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటే రూ. 75 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. అలాగే రూ. 999 ప్లాన్‌పై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే వీఐతో పాటు జియో సైతం వరల్డ్‌ కప్‌ కోసం ప్రత్యేకంగా రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటించాయి. రూ. 328 తో రీచార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు డిస్నీ+హాట్‌ స్టోర్‌ ఉచితంగా పొందొచ్చు. ఇక రూ. 388తో ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో రోజు 2జీబీ డేటా పొందొచ్చు. ఇక రూ. 808తో రీఛార్జ్‌ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా పొందొచ్చు. ఇక రూ. 598తో రీఛార్జ్‌ చేసుకునే 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. అలాగే రూ. 3178 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటనే 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..