Vivo Y200: భారత మార్కెట్లోకి వివో నుంచి కొత్త ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..

|

Oct 25, 2023 | 9:09 AM

ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో సైతం కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై200 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. అక్టోబర్‌ 23వ తేదీన వివో ఈ కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై 200 స్మార్ట్‌ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో అందించింది. 8 జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ర్యామ్‌ను పెంచుకునే ఫీచర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రెండు కలర్స్‌ ఆప్షన్స్‌లో...

Vivo Y200: భారత మార్కెట్లోకి వివో నుంచి కొత్త ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..
Vivo Y200 5g
Follow us on

పండుగల సీజన్‌ల వేళ ఈ కామర్స్‌ సైట్స్‌ స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ అందిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సైతం స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్స్‌ అందిస్తున్నాయి. ఇక ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు సైతం కొంగొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే చైనాకు చెందిన పలు స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేశాయి. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో సైతం కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై200 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. అక్టోబర్‌ 23వ తేదీన వివో ఈ కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై 200 స్మార్ట్‌ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో అందించింది. 8 జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ర్యామ్‌ను పెంచుకునే ఫీచర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రెండు కలర్స్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ చేశారు. గత ఫిబ్రవరిలో తీసుకొచ్చిన వివో వై100 ఫోన్‌కు కొనసాగింపుగా వివో వై200 ఫోన్‌ను తీసుకొచ్చారు. వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌ కార్ట్‌, అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ సైట్స్‌, రిటైల్ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి.

ఇక ధర విషయానికొస్తే ఈ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 21,999కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,999గా ఉంది. జంగల్‌ గ్రీన్‌ డిసర్ట్‌ గోల్డ్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై డిస్కౌంట్ సైతం లభిస్తోంది. ఎస్‌బీఐ, ఇండస్‌లండ్‌, ఐడీఎఫ్‌సీ, యస్‌ బ్యాంక్‌ వంటి బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం ఉంది. ఫీచర్ల విషయానికొస్తే వివో వై200 స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

1,080×2,400 పిక్సెల్స్‌ ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీస్ సొంతం. ఇక ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. నైట్‌మోడ్‌, పనోరమో, టైమ్‌ లైప్స్‌ వీడియో, డ్యూయల్ వ్యూ పొర్ట్‌రేట్‌, స్లో మోషన్‌ వంటి ఫీచర్స్‌కు ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో వైఫై, బ్లూటూత్‌ 5.2, జీపీఎస్‌, యూఎస్‌బీ 2.0 కనెక్టివిటీ ఫీచర్స్‌ను అందించారు. ఫింగర్ ప్రింట్‌ స్కానర్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఐపీ54 వాటర్‌ రెసిస్టెంట్‌ను అందించారు. ఇక 44 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4800 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ 190 గ్రాముల బరువు ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..