Vivo T3 Lite 5G: రూ. 10వేలలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. మార్కెట్లోకి వివో కొత్త ఫోన్‌

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ తరుణంలోనే స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు 5జీ ఫోన్‌లను పెద్ద ఎత్తు తీసుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా కంపెనీల మధ్య నెలకొన్న పోటీ క్రమంలో తక్కువ ధరలో 5జీ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం...

Vivo T3 Lite 5G: రూ. 10వేలలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. మార్కెట్లోకి వివో కొత్త ఫోన్‌
Vivo T3 Lite 5g
Follow us

|

Updated on: Jun 27, 2024 | 6:02 PM

ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ తరుణంలోనే స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు 5జీ ఫోన్‌లను పెద్ద ఎత్తు తీసుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా కంపెనీల మధ్య నెలకొన్న పోటీ క్రమంలో తక్కువ ధరలో 5జీ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో టీ3 లైట్‌ పేరుతో ఈ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నియ.? ధర ఎంత లాంటి వివరాలు ఇప్పుడు తెలుుకుందాం.

వివో టీ3 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా టీ3 లైట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. గురువారం ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించారు. అయితే యూజర్లకు ఈ ఫోన్‌ జూలై 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివో ఇండియా వెబ్‌సైట్, కొన్ని ఎంపిక చేసిన స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది.

ధర విషయానికొస్తే వివో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర ర. 10,499కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 11499గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫరలో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్ఆనరు. ఈ లెక్కన ఈ 5జీ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ను రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చన్నమాట.

ఇక వివో టీ3 లైట్‌ 5జీ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 656 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 840 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌ 6ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా చూస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఐపీ64 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..