
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికీ ఓ నిత్యావసరం. అది లేకుండా అడుగు ముందుకేయలేని పరిస్థితి. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా ఇట్టే తెలిసిపోతుందంటే దాని కారణం సెల్ ఫోన్ అనే చెప్పాలి. అందుకే అందరూ మంచి ఫీచర్లలో కూడిన స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలని భావిస్తున్నారు. అయితే అదే సమయంలో బడ్జెట్ విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉంటే వివో మీకు మంచి ఆఫర్లను అందిస్తోంది. అందుకే మీరు ఒకవేళ మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తుంటే.. మీకు ఇదే మంచి సమయం. ఎందుకంటే వివో సంస్థ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ ఎక్స్ సిరీస్, వై సిరీస్, వీ సిరీస్ స్మార్ట్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఫోన్లు ఏంటి? ఆ ఇండిపెండెన్స్ డే ఆఫర్లేంటి? తెలుసుకుందాం రండి..
వివో ఎక్స్90 సిరీస్.. ఈ సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీనిని ఐసీఐసీఐ, కోటక్, వన్ కార్డ్ లను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 10,000 ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంటుంది. అదే ఎస్బీఐ కార్డుతో అయితే రూ. 8,500 క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాషిఫై యాప్ ద్వారా పాత ఫోన్ ని ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 8000 వరకూ ఎక్స్ చేంజ్ బోనస్ వస్తుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కోటక్, వన్ కార్డ్ లపై కొనుగోలు చేస్తే రూ. 4,000 వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది.
వివో వీ27 సిరీస్ ఫోన్లు.. ఈ ఫోన్ ను ఐసీఐసీఐ, ఎస్బీఐ, కోటాక్, వన్ కార్డ్ , ఫెడరల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బ్యాంక్ కార్డులపై రూ. 3,500 వరకూ క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
వివో వై100/వై100ఏ.. ఈ ఫోన్ పై ఐసీఐసీఐ, ఎస్బీఐ, వన్ కార్డ్, కోటక్, ఐడీఎఫ్సీఫెడరల్, బ్యాంక్ ఆప్ బరోడా, ఎస్ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది.
ఇటీవల ఐడీసీ విడుదల చేసిన రిపోర్టుల్లో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. అదేంటంటే మన దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లలో వివోనే టాప్ ప్లేస్ ల ఉందని పేర్కొంది. 2023 క్యార్టర్ 2లో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో టాప్ లేపింది వివో. దీని తర్వాత శామ్సంగ్ ఉంది. మొత్తం మార్కెట్లో వివో ఏకంగా 16శాతం మార్కెట్ ను గ్రాబ్ చేసింది. గతేడాదితో పోల్చితే ఇది 7.4శాతం అధికం. శామ్సంగ్ 15.7శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇది గతేడాదితో పోల్చితే ఏకంగా 6.2శాతం తక్కువ. అ తర్వాత స్థానంలో రియల్ మీ ఉంది. ఇది 12.6శాతం అమ్మకాలు చేసింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..