AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ludo Game: లూడో గేమ్‌లో ఓడి.. ఇంటి యజమాని సొంతమైన మహిళ.. చివరికి ఎంట్రీ ఇచ్చిన భర్త..

భర్త ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తూ డబ్బులు పంపుతుండగా, భార్య ఆ డబ్బును లూడోలో పోగొట్టుకునేది. డబ్బు అయిపోవడంతోపాటు.. అదే జూదంలో తనను తాను పణంగా పెట్టి, యజమాని ముందు ఓడిపోయింది. భర్త తన భార్య కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండగా..

Ludo Game: లూడో గేమ్‌లో ఓడి.. ఇంటి యజమాని సొంతమైన మహిళ.. చివరికి ఎంట్రీ ఇచ్చిన భర్త..
Ludo
Sanjay Kasula
|

Updated on: Dec 05, 2022 | 1:15 PM

Share

మహాభారతంలో పాండవులు జూదంలో ద్రౌపదిని పణంగా పెట్టిన కథను మనం చాలా సార్లు వినిఉంటాం. అయితే ఇప్పుడు అలాంటి కథే ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో తెరపైకి వచ్చింది. నగరంలోని కొత్వాలి ప్రాంతంలో నివసించే ఓ మహిళ తన భర్త లేని సమయంలో తన యజమానితో కలిసి లూడో ఆడేది. భర్త పంపించిన డబ్బులు అయిపోవడంతో  ఆమె తనను తాను పణంగా పెట్టి, ఆపై యజమాని ముందు తనను తాను కోల్పోయింది. దీని గురించి సమాచారం అందుకున్న బాధితురాలి భర్తకు మెసెజ్ చేసింది. ఈ మెసెజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

బాధితురాలి భర్త దేవ్‌కలి (ప్రతాప్‌గఢ్)లో అద్దె ఇంట్లో ఉండేవాడని పేర్కొన్నాడు. 6 నెలల క్రితం జీవనోపాధి నిమిత్తం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లి తన సంపాదనలో కడుపు కోసి భార్యకు డబ్బులు పంపుతూనే ఉన్నాడు. ఆ మహిళ తన యజమానితో కలిసి జూదంలో అదే డబ్బును ఖర్చు చేస్తూ వచ్చింది. డబ్బు అయిపోయిన తర్వాత, ఆమె తనను తాను పణంగా పెట్టి తనను తాను కోల్పోయింది.  భర్త తన భార్య కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండగా.. ఆ మహిళ ఇప్పుడు ఇంటి యజమానితో కలిసి జీవించవలసి వచ్చింది.

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఈ మహిళ తనను తానే పందెంగా కాసి లూడో గేమ్​లో పాల్గొంది. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానితో లూడో గేమ్​ ఆడి ఓడిపోయింది. దీంతో ఆమెను సొంతం చేసుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడం వల్ల అతడు పోలీసులను ఆశ్రయించాడు.

ప్రతాప్​గఢ్​ జిల్లాకు చెందిన ఓ మహిళ.. తాను ఉంటున్న ఇంటి ఓనర్‌తో లూడో గేమ్ ఆడింది. అయితే ఇందులో పందెంగా తననే పెట్టింది. ఈ గేమ్​లో​ ఆమె ఓటమి పాలవగా.. ఇంటి ఓనర్​ దక్కించుకున్నాడు. రాజస్థాన్​లోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తు ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. అయితే ఓ రోజు భార్యకు ఫోన్​ చేసి తాను ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. దీంతో అసలు విషయం భర్తకు చెప్పింది.

తాను ఆటలో ఓడిపోయి ఇంటి యజమానికి సొంతం అయ్యానని.. మీరు ఇంటికి వస్తే తనను చంపేస్తాడని చెప్పింది. మీరు ఇంటికి రాకుండా పోలీసులను కలవాలని కోరింది. దీంతో షాక్​కు గురైన భర్త వెంటనే సొంత గ్రామానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన భార్య నిత్యం జూదం, ఆన్​లైన్ గేమ్స్​ ఆడుతుండేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపాడు. ఇంటి యజమానికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం