AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Data Booster Plans: ఈ ప్లాన్లతో నాన్-స్టాప్ సేవలు.. మీ ఫోన్‌కు నిరంతరాయంగా ఇంటర్‌నెట్..

చాలా ప్లాన్లలో ఫోన్ కాల్స్ చేసుకోవడానికి అవసరమయ్యే బాలెన్స్ తోనే డేటా కూడా ఉంటుంది. ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు దాదాపు నెల రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఒకసారి రీచార్జి చేసుకుంటే నెల రోజుల పాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజూ పరిమితి మేరకు డేటా లభిస్తుంది.

Jio Data Booster Plans: ఈ ప్లాన్లతో నాన్-స్టాప్ సేవలు.. మీ ఫోన్‌కు నిరంతరాయంగా ఇంటర్‌నెట్..
Jio
Madhu
|

Updated on: Jun 16, 2024 | 4:02 PM

Share

స్మార్ట్ ఫోన్ కనీస అవసరంగా మారిన ఈ రోజుల్లో అది పనిచేయడానికి ఇంటర్నెట్ డేటా చాలా అవసరం. ఇంటర్నెట్ లేకపోతే ఎంత ఖరీదైన ఫోన్ ఉన్నా ప్రయోజనం ఉండదు. వాట్సాప్, ఫేస్ బుక్, డిజిటల్ లావాదేవీలు కొనసాగించడానికి డేటా అనేది ప్రధానం. చాలా ప్లాన్లలో ఫోన్ కాల్స్ చేసుకోవడానికి అవసరమయ్యే బాలెన్స్ తోనే డేటా కూడా ఉంటుంది. ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు దాదాపు నెల రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఒకసారి రీచార్జి చేసుకుంటే నెల రోజుల పాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజూ పరిమితి మేరకు డేటా లభిస్తుంది.

పనికి అంతరాయం లేకుండా..

స్మార్ట్ ఫోన్ లో మనం ముఖ్యమైన పనిలో ఉన్నపుడు డేటా అయిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ పనికి తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీనివల్ల మీ ముఖ్యమైన పని ఆగిపోవచ్చు. టీవీ షో, క్రికెట్ మ్యాచ్ చూడడం కుదరకపోవచ్చు. యూపీఐ చెల్లింపులు మధ్యలో ఆగిపోవచ్చు. డబ్బులు వేరొకరికి ట్రాన్స్ ఫర్ అవ్వకపోవచ్చు.

అతి తక్కువ ధరలో..

ఫోన్ వినియోగదారులకు డేటా అయిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి పనికి అంతరాయం లేకుండా ఉండేందుకు రిలయన్స్ జియో వివిధ ప్రీపెయిడ్ డేటా బూస్టర్ ప్లాన్లను అందిస్తుంది. అవి కూడా అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

జియో డేటా బూస్టర్ ప్లాన్లు..

రూ. 15 ప్లాన్.. పని చివరిలో డేటా అయిపోతే ఈ ప్లాన్ చాలా వీలుగా ఉంది. రూ.15 ప్లాన్ కింద వన్ జీబీ డేటా లభిస్తుంది. మీ పని అంతరాయం లేకుండా కొనసాగుతుంది. మీ ప్రస్తుత ప్లాన్ ఉన్నంత వరకూ చెల్లుబాటులో ఉంటుంది.

రూ. 19 ప్లాన్.. ఈ ప్లాన్ తో 1.5 జీబీ డేటా పొందవచ్చు. మీ యాక్టివ్ ప్లాన్ వ్యవధి వరకూ ఈ డేటా కొనసాగుతుంది. కొంచెం అదనపు డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుంది.

రూ. 25 ప్లాన్.. కొంచె డేటా ఎక్కువ అవసరం ఉన్న వారికి ఈ ప్లాన్ ఉపయోగంగా ఉంటుంది. కేవలం రూ. 25కే 2 జీబీ డేటా లభిస్తుంది. దీంతో మీరు ప్రశాంతంగా బ్రౌజింగ్, స్ట్రీమింగ్ కొనసాగించవచ్చు. దీని చెల్లుబాటు కూడా మీ ప్రస్తుత ప్లాన్‌తో ముడిపడి ఉంటుంది.

రూ. 29 ప్లాన్.. 2 జీబీ కంటే ఎక్కువ డేటా కావాలనుకునే వారు రూ. 29 ప్లాన్ ను ఎంపిక చేసుకోవచ్చు. దీని ద్వారా 2.5 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ చెల్లుబాటు మీ ప్రస్తుత ప్లాన్‌ వరకూ ఉంటుంది.

రూ. 61 ప్లాన్.. ఈ ప్లాన్ లో 6 జీబీ డేటా లభిస్తుంది. భారీ డేటా కావాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది.

రూ.121 ప్లాన్.. వీడియోలను స్ట్రీమింగ్ చేయడం, పెద్ద ఫైల్స్ ను డౌన్‌లోడ్ చేయడం వంటి వాటికి ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుంది. రూ.121 ప్లాన్ తీసుకుంటే 12 జీబీ డేటాను అందుతుంది.

క్రికెట్ డేటా ప్యాక్.. క్రికెట్ అభిమానులు, భారీ డేటా వినియోగదారుల కోసం రూ.222లకు జియో క్రికెట్ డేటా ప్యాక్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా 50 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, ఇతర ప్రసారాలను అంతరాయం లేకుండా వీక్షించవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..