Laptop: స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ వచ్చేస్తోందోచ్‌.. ఇంతకీ ఇది ఎలా పని చేస్తుంది? వీడియో చూడండి

స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ లాంచ్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే మూడేళ్లు కష్టపడి స్క్రీన్ లేకుండా పనిచేసే ల్యాప్‌టాప్‌ను సైట్‌ఫుల్ రూపొందించింది. స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ ఎలా పని చేస్తుందనే అనుమానం మీకు రావచ్చు. సైట్‌ఫుల్ కృషి ఫలితంగా కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి AR (Augmented reality) ల్యాప్‌టాప్‌ను రూపొందించింది. ఇది ఏఆర్‌ గ్లాసెస్ సహాయంతో..

Laptop: స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ వచ్చేస్తోందోచ్‌.. ఇంతకీ ఇది ఎలా పని చేస్తుంది? వీడియో చూడండి
Ar Laptop
Follow us

|

Updated on: Jun 16, 2024 | 7:48 PM

స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ లాంచ్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే మూడేళ్లు కష్టపడి స్క్రీన్ లేకుండా పనిచేసే ల్యాప్‌టాప్‌ను సైట్‌ఫుల్ రూపొందించింది. స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ ఎలా పని చేస్తుందనే అనుమానం మీకు రావచ్చు. సైట్‌ఫుల్ కృషి ఫలితంగా కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి AR (Augmented reality) ల్యాప్‌టాప్‌ను రూపొందించింది. ఇది ఏఆర్‌ గ్లాసెస్ సహాయంతో 100-అంగుళాల వర్చువల్ డిస్‌ప్లేను చూపుతుంది. ఈ ల్యాప్‌టాప్ పేరు Spacetop G1, ఈ ల్యాప్‌టాప్ ఏ ఫీచర్లను అందిస్తుంది? ఈ ల్యాప్‌టాప్ ఎలా పని చేస్తుంది.. ముఖ్యంగా ఈ ల్యాప్‌టాప్ ధర ఎంత? తదితర వివరాలు తెలుసుకుందాం?

Sightful Spacetop G1 ఫీచర్స్‌:

ల్యాప్‌టాప్ 100-అంగుళాల వర్చువల్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. Chrome ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. ఇది గ్రాఫిక్స్ కోసం KRYO CPU, Adreno 740 GPUతో Qualcomm Snapdragon QCS8550ని ఉపయోగిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 16 GB LPDDR5 RAM, 128 GB UFS3.1 స్టోరేజీని ఉపయోగిస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ ల్యాప్‌టాప్‌లో 2 USB టైప్-సి పోర్ట్‌లు, Wi-Fi 7, 5G (నానో-సిమ్ మరియు ఇ-సిమ్ సపోర్ట్), బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ ఉన్నాయి. ల్యాప్‌టాప్ 60Wh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు పని చేస్తుంది కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఏఆర్‌ గ్లాసెస్ గురించి మాట్లాడితే.. ఈ గ్లాసెస్ స్పష్టమైన, అధిక-రిజల్యూషన్ OLED డిస్‌ప్లే ప్యానెల్‌తో వస్తుంది.

Sightful Spacetop G1 ధర

ఏఆర్‌ టెక్నాలజీతో వచ్చే ఈ ప్రత్యేకమైన ల్యాప్‌టాప్ ధరను కంపెనీ $1,700 (సుమారు రూ. 1,42,035)గా నిర్ణయించింది. అయితే ల్యాప్‌టాప్ సాధారణంగా $1,900 (సుమారు రూ. 1,58,745)కి విక్రయిస్తుంది. ల్యాప్‌టాప్‌ను $100 (సుమారు రూ. 8355) చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ల్యాప్‌టాప్ డెలివరీ అక్టోబర్ 2024 నుండి యూఎస్‌లో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్‌లో వినియోగదారుల కోసం ఎప్పుడు లాంచ్ చేస్తారనే దానిపై స్పష్టత లేదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles