AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Stickers: మీ బంధువులకు రాఖీ శుభాకాంక్షలు ఆకట్టుకునే స్టిక్కర్లతో ఇలా తెలపండి.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే.

Whatsapp Rakhi Stickers: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ సందడి అప్పుడే మొదలైంది. వీధుల్లో రకరకలాల రాఖీలతో స్టాల్స్‌ సందడి చేస్తున్నాయి. తమ తోబుట్టువులకు రాఖీ కట్టడానికి..

Rakhi Stickers: మీ బంధువులకు రాఖీ శుభాకాంక్షలు ఆకట్టుకునే స్టిక్కర్లతో ఇలా తెలపండి.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే.
Rakshi
Narender Vaitla
|

Updated on: Aug 21, 2021 | 3:42 PM

Share

Whatsapp Rakhi Stickers: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ సందడి అప్పుడే మొదలైంది. వీధుల్లో రకరకలాల రాఖీలతో స్టాల్స్‌ సందడి చేస్తున్నాయి. తమ తోబుట్టువులకు రాఖీ కట్టడానికి సోదరీమణులు సిద్ధమవుతున్నారు. తమ సోదరుడి క్షేమాన్ని కోరుతూ నీకు నేను రక్షగా ఉంటానంటూ తెలుపుతూ రాఖీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక అన్నా/తమ్ములు తమ మంచి కోరి రాఖీ కట్టిన సోదరీమణులను నిండు మనసుతో దీవిస్తుంటారు.

మరి సోషల్‌ మీడియా వేదికగా పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు ఫొటోలు డౌన్‌లోడ్‌ చేస్తున్నారా.? అయితే అందరిలా కామన్‌గా విషెస్‌ చెబితే ఏముటుంది చెప్పండి. అందుకే వాట్సాప్ ద్వారా రాఖీ స్టిక్కర్లను పంపించుకోండి. ఇంతకీ రాఖీ స్టిక్కర్లు, జిప్‌ ఫైల్స్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.. వాటిని మీ శ్రేయోభిలాషులకు ఎలా పంపించుకోవాలి లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

* ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి రక్షా బంధన్‌ వాట్సాప్‌ స్టిక్కర్లను సెర్చ్‌ చేయాలి.

* అనంతరం కనిపించే స్కిక్కర్ ప్యాక్‌లలో ఏదైనా ఒక యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోని ‘యాడ్‌ టు వాట్సాప్‌’పై క్లిక్‌ చేయాలి.

* యాప్‌ డౌన్‌లోడ్‌ అయిన తర్వాత మీ వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి. మీరు ఎవరికైతే మెసేజ్‌ పంపించాలనుకుంటున్నారో వారి చాట్‌ను ఓపెన్‌ చేయండి.

* తర్వాత చాట్‌ బాక్స్‌ కింద కనిపించే స్టిక్కర్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.

* దీంతో మీరు అప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న స్టిక్కర్స్‌ దర్శనమిస్తాయి. అందులో మీకు నచ్చిన రాఖీ స్టిక్కర్‌ను సెలక్ట్‌ చేసుకొని సెండ్‌ చేస్తే సరిపోతుంది.

* మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే రాఖీ స్టిక్కర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రాఖీ శుభాకాంక్షలను వెరైటీగా తెలపండి.

Also Read: Census 2021: కరోనా దెబ్బకు 2021 జనాభా లెక్కలు తేలలేదు.. దీని ప్రభావం మనమీద ఎలా ఉంటుందో తెలుసా?

తాత్కాలిక ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన..

Vishwakarma: విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : అధ్యక్షుడు నరసింహచారి