రూ. 30వేలలోపు ధరలోనే 4కే స్మార్ట్ టీవీ.. టాప్ బ్రాండ్.. ఫీచర్లు కూడా సూపర్.. మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి చాన్స్..
Thomson 4K Smart TV: ప్రముఖ టీవీల బ్రాండ్ థామ్సన్ అతి తక్కువ ధరలోనే అద్భుతమైన స్మార్ట్ టీవీలను మార్కెట్లో విడుదల చేసింది. 50 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీ కేవలం రూ. 27,999కే లభిస్తోంది. అలాగే 43 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ధర రూ. 22,999గా ఉంది.
ప్రస్తుతం టీవీల ట్రెండ్ మారిపోయింది. స్మార్ట్ వాచ్, స్మార్ట్ వాచ్ ల మాదిరిగానే అత్యధిక ఫీచర్లు, యాప్ సపోర్టుతో కూడిన స్మార్ట్ టీవీలపై ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఓటీటీ ప్లాట్ ఫారాలు జనాలకు బాగా కనెక్ట్ కావడంతో అందరూ స్మార్ట్ టీవీల బాటా పడుతున్నారు. అవి కూడా 32 అంగుళాల కన్నా ఎక్కువ ఉన్న టీవీలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీల బ్రాండ్ థామ్సన్ ఇండియా లైసెన్సీ ఎస్పీపీఎల్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. అతి తక్కువ ధరలోనే అద్భుతమైన స్మార్ట్ టీవీలను మార్కెట్లో విడుదల చేసింది. 50 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీ కేవలం రూ. 27,999కే లభిస్తోంది. అలాగే 43 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ధర రూ. 22,999గా ఉంది. అంతేకాక ఈ టీవీలపై ప్రముఖ ఈ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో పలు బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ 4కే టీవీలే కాక హెచ్ డీ, ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ టీవీలు కూడా 32, 40, 42 అంగుళాల టీవీలను లాంచ్ చేసింది. వీటికి సంబంధించిన ఫీచర్లు ఇప్పుడు చూద్దాం..
50, 43 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్లు..
ఈ థామ్సన్ 4కే టీవీల్లో గూగుల్ టీవీ ఓఎస్ ఉంటుంది. డాల్బీ విజన్ హెచ్ ఆర్ ప్లస్, డాల్బీ అట్మోస్, డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ ట్రూ సౌండ్ వంటి అత్యాధునిక సదుపాయాలతో వీక్షకులకు మంచి అనుభూతిని అందిస్తాయి. అలాగే ఈ టీవీల్లో 40వాట్ల స్పీకర్లు ఉంటాయి. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్(2.4GHz + 5GHz) వైఫై, బ్లూటూత్ సపోర్టు ఉంటుంది. ల్యాప్ టాప్ లేదా మొబైల్ నుంచి మిర్రర్ వ్యూయింగ్ చేయొచ్చు.
ఈ 4కే టీవీల్లో నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి అనేక యాప్స్ ఉంటాయి. దీని ప్యాకేజ్ లో బ్లూటూత్ రిమోట్, హాట్కీస్ ఉంటాయి. వీటి ద్వారా యూ ట్యూబ్, గూగుల్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటివి వినియోగించవచ్చు. గూగల్ అసిస్టంట్ తో వాయిస్ కంట్రోల్స్ ద్వారా యాప్ నిర్వహణ చేయొచ్చు. ఇందుకోసం షార్ట్ కట్లు కూడా ఉంటాయి.
ఈ 4కే టీవీలు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి. అలేక బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డును వినియోగించి లావాదేవీ చేస్తే 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ. 1500వరకూ తగ్గుతుంది. అలాగే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి ఈఎంఐ లావాదేవీలు పెట్టుకుంటే 1250 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..