Ocean cleanup yacht: ఈ యాచ్ సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను పైకి తోడుతుంది.. అదే వ్యర్థాలను ఇంధనంగా మారుస్తుంది

|

Jan 29, 2021 | 9:12 PM

ఫ్రెంచ్‌కు చెందిన ఓ ఓషన్ అడ్వెంచరర్(సముద్ర సాహసికుడు), అతని టీమ్ కలిసి ఒక యాచ్(పడవ)ను రూపొందించారు. ఇది సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను పైకి తోడుతుంది. అంతేకాదు అదే వ్యర్థాలను పడవకు అవసరమయ్యే ఇంధనంగా మారుస్తుందట.

Ocean cleanup yacht: ఈ యాచ్ సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను పైకి తోడుతుంది.. అదే వ్యర్థాలను ఇంధనంగా మారుస్తుంది
Follow us on

Ocean cleanup yacht:  ఫ్రెంచ్‌కు చెందిన ఓ ఓషన్ అడ్వెంచరర్ అద్భుతం చేసేందుకు రెడీ అయ్యారు. తన టీమ్ కలిసి ఒక యాచ్(పడవ)ను రూపొందించారు. ఇది సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను పైకి తోడుతుంది. అంతేకాదు అదే వ్యర్థాలను పడవకు అవసరమయ్యే ఇంధనంగా మారుస్తుందట. ఈ విషయాన్ని సదరు ఓషన్ అడ్వెంచరర్ వైవాన్ బౌర్గాన్ నమ్మకంగా చెప్తున్నారు. ప్రస్తుతం  డ్రాయింగ్ బోర్డులో మాత్రమే ఉన్న ఈ యాచ్‌ను  2024 లో దీన్ని లాంచ్ చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇలాంటివి 400 యాచ్‌లు కనుక తయారుచేస్తే..సముద్రాల్లోని 1/3వ వంతు ప్లాస్టిక్ వ్యర్థాలను క్లీన్ చేయవచ్చని వివరించారు. 2060 నాటికి సముద్రాల్లో ఇప్పుడుదానికంటే మూడు రెట్టు ఎక్కువ చెత్త ఉంటుందని.. ఇదే విషయాన్ని ఇప్పటికే పలు సంస్థలు అంచనా వేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేవలం డ్రై ల్యాండ్‌పై మాత్రమే వ్యర్థాల నిర్మూలనపై ఫోకస్ పెడతాం.. సముద్రాల్లోకి వ్యర్థాలను వదలుతాం అని ఎవరైనా అంటుంటే ఇది పూర్తిగా ఫూలిష్‌నెస్ అని ఆయన పేర్కొన్నారు

ఎవరీ వైవాన్ బౌర్గాన్:

వైవాన్ బౌర్గాన్..పడవ పోటీదారుడిగా తన జీవితంలో చాలా భాగాన్ని.. వరల్డ్‌వైడ్ రేసింగ్ సెయిలింగ్ వెజల్స్‌పై గడిపాడు. అయితే  చెత్త  తేలియాడే కార్పెట్స్ సముద్రంలో తరచుగా అతనికి దర్శనమివ్వడంతో విసుగు చెందేవాడు. ఇదే అతని కొత్త ఇన్నోవేషన్‌కు కారణమైంది.

ఈ యాచ్ ఎలా పనిచేస్తుంది:

వైవాన్ బౌర్గాన్ తన బృదంతో కలిసి రూపొందించిన 56-మీటర్ల (183 అడుగుల) పొడవైన కాటమరాన్ హైటె క్ సెయిల్స్, ఎలక్ట్రిక్ మోటార్లు కలయికతో ముందుకు వెళుతుంది. పడవ నీటిలో కదులుతున్నప్పుడు…కన్వేయర్ బెల్టులు వ్యర్థాలను ఏరి.. పోగుచేస్తాయి.  తరువాత ఆ వ్యర్థాలను కాల్చి.. ప్లాస్టిక్‌ను కరిగించి, టర్బైన్‌ను నడిపించే వాయువును ఉత్పత్తి చేస్తుంది. దాని ద్వారా పడవ వ్యవస్థలను ఉపయోగించటానికి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్తు..బోటు డెక్ పైన ఉండే సోలార్ సెల్స్ విండ్ టర్బైన్‌లతో పాటు పడవని 70% ఎనర్జీతో ముందుకు నడిపిస్తుంది.

 

Also Read:

హైవేపై కారు నడిపిన ఐదేళ్ల బాలుడు.. వీడియో చూసి నెటిజన్ల ఆగ్రహం.. తల్లిదండ్రులపై చర్యలకు డిమాండ్‌

Cockfights in Mancherial: తెలంగాణకు పాకిన కోడి పందాల కల్చర్.. మంచిర్యాలలో బరులపై పోలీసుల దాడులు