Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips to AC Cool Faster: ఈ సింపుల్ టిప్స్‌తో ఎక్కువ కూలింగ్ .. తక్కువ కరెంటు బిల్.. ఏసీని ఇలాగే వాడాలి!

24 గంటలూ ఏసీలు ఆన్ లోనే ఉండాల్సి వస్తోంది.. దీంతో కరెంట్ బిల్లు తడిసి మొపెడవుతోంది. పైగా అత్యధిక వినియోగం కారణంగా ఏసీలు వేసినా కూడా గది త్వరగా కూల్ కాని పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి సమయంలోనే మీరు కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలి. స్మార్ట్ గా ఆలోచించాలి.

Tips to AC Cool Faster: ఈ సింపుల్ టిప్స్‌తో ఎక్కువ కూలింగ్ .. తక్కువ కరెంటు బిల్.. ఏసీని ఇలాగే వాడాలి!
Air Conditioner
Follow us
Madhu

|

Updated on: May 27, 2023 | 5:00 PM

రోహిణీ కార్తెలో ప్రవేశించాం.. ఎండు మండిపోతున్నాయి. దేశంలో చాలా చోట్ల ఉష్ణోగ్రత్తలు 45 నుంచి 50 డిగ్రీలకు చేరుకుంటోంది. విపరీతమైన ఉక్కపోత, వేడిగాలులతో జానాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8గంటల నుంచి భానుడే తన ప్రతాపం చూపుతున్నాడు. ఈ క్రమంలో అందరూ ఎయిర్ కండీషనర్లు(ఏసీ)కు పనిచెబుతున్నారు. అది లేకుండా నిమిషం ఉండలేకపోతున్నారు. దీంతో 24 గంటలూ ఏసీలు ఆన్ లోనే ఉండాల్సి వస్తోంది.. దీంతో కరెంట్ బిల్లు తడిసి మొపెడవుతోంది. పైగా అత్యధిక వినియోగం కారణంగా ఏసీలు వేసినా కూడా గది త్వరగా కూల్ కాని పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి సమయంలోనే మీరు కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలి. స్మార్ట్ గా ఆలోచించాలి. అప్పుడే కరెంటు బిల్లు అదుపులో ఉంచుకోవచ్చు.. అలాగే ఏసీ నుంచి మంచి పనితీరును పొందవచ్చు. ఆ స్మార్ట్ అండ్ ఈజీ టిప్స్ ఏంటో చూద్దా రండి..

తగినంత ఉష్ణోగ్రత.. ఏసీలో టెంపరేచర్ ను ఎంత తక్కువగా ఉంటే గది అంత వేగంగా చల్ల బడుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ అసలు విషయం అది కాదు. వాస్తవానికి 24 డిగ్రీలు అనేది మనిషి శరీరానికి అనువైన ఉష్ణోగ్రత. ఆ ఉష్ణోగ్రత వద్ద ఏసీ ని ఫిక్స్ చేయడం వల్ల మీ గది వాతావరణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఏసీపై లోడ్ కూడా తగ్గుతుంది. తద్వారా ఏసీ సమర్థంగా పనిచేయడంతో పాటు తక్కువ కరెంట్ ను వినియోగిస్తుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషీయన్సీ చెబుతోంది.

రెగ్యులర్ సర్వీసింగ్.. ఏసీ నిర్వహణ సరిగా ఉండాలి. అప్పుడే దాని సామర్థ్యం మరింత పెరుగుతుంది. తద్వారా డబ్బు కూడా ఆదా అవుతుంది. మీ ఏసీ రెగ్యులర్ సర్వీసింగ్‌ను తప్పనిసరిగా షెడ్యూల్ చేయాలి. వేసవి సీజన్ ప్రారంభంలో ఏసీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మీరు ఏసీని కొనుగోలు చేసిన కంపెనీ నుంచి టెక్ నిపుణులను పిలవాలి.

ఇవి కూడా చదవండి

ఫిల్టర్‌ క్లీనింగ్.. ఏసీ సర్వీసింగ్ ఒక సీజన్‌లో ఒకటి లేదా రెండుసార్లు చేయాలి. అయితే, ఏసీ ఫిల్టర్లను క్లీనింగ్ అనేది నెలకు ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేయడం ఉత్తమం. కాలుష్యం, దుమ్ము చేరి ఏసీ ఫిల్టర్‌లకు అడ్డుపడతాయి. దీంతో కూలింగ్ త్వరగా రాదు. ఫలితంగా మరింత శక్తిని వినియోగిస్తుంది. వేడి గాలి వస్తుంది. అందుకే ఫిల్టర్‌ను నీటితో క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి. అలాగే కండెన్సర్ యూనిట్‌ను కూడా శుభ్రం చేయాలి. ఎందుకంటే అది బయట ఉంచుతారు. దానిపై బాగా మురికి ఉంటుంది.

అన్ని మూసేయాలి.. మీ ఏసీ సామర్థ్యాన్నిపెంచడానికి, చల్లని గాలి బయటకు పోకుండా.. వేడి గాలి లోపలికి రాకుండా అన్ని కిటికీలు, తలుపులు మూసి వేయాలి.

సీలింగ్ ఫ్యాన్ ఆన్ లో ఉంచాలి.. గాలి ప్రసరణ, కూలింగ్ స్పీడ్ మెరుగుపరచేందుకు ఏసీతో పాటు మీ సీలింగ్ ఫ్యాన్‌ను కూడా ఆన్ చేసి ఉంచాలి. అయితే తక్కువ వేగంతో ఫ్యాన్‌లను వాడితే.. గది అంతటా చల్లటి గాలిని సమర్థవంతంగా పంపిణీ చేయడంలో సాయపడుతుంది.

మోడ్‌లను చెక్ చేయాలి.. మీ ఏసీ యూనిట్‌లో అందుబాటులో ఉన్న విభిన్న మోడ్‌లను చెక్ చేయండి. అనేక ఆధునిక ఏసీలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించగలవు. అందులో 80 శాతం, 60 శాతం లేదా 25 శాతం సామర్థ్యం వంటి వివిధ మోడ్‌లను అందిస్తాయి. మీ గది వాతావరణ పరిస్థితులకు ఏది మంచిదో గుర్తించేందుకు ఈ మోడ్‌లతో టెస్టింగ్ చేయండి.

టైమర్‌ని ఆన్ చేయండి.. చాలా ఏసీలు ఇంటర్నల్ టైమర్‌ని కలిగి ఉంటాయి. మీరు నిద్రపోయే ముందు టైమర్‌ని సెట్ చేయండి. గది తగినంత చల్లగా ఉన్న తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత AC ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీనివల్ల రాత్రిపూట విద్యుత్ వినియోగం తగ్గుతుంది. టైమర్ యూనిట్‌ను ఆఫ్ చేసేందుకు మీరు నిద్ర మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు.

ప్రోగ్రామబుల్ థర్మోస్టాట్.. ప్రోగ్రామబుల్ థర్మోస్టాట్ రోజులో వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఉష్ణోగ్రతలను సెట్ చేయడానికి అనుమతిస్తుంది. మీరు నిద్రిస్తున్నప్పుడు లేదా దూరంగా ఉన్నప్పుడు కూలింగ్ తగ్గించడం ద్వారా శక్తిని ఆదా చేయడంలో సాయపడుతుంది.

అప్‌గ్రేడ్ చేయోచ్చు.. మీ ఏసీ పాతది అయితే వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండి. కొత్త ఏసీ యూనిట్లు చాలా శక్తివంతమైనవిగా ఉంటాయి. మీ పవర్ బిల్లులపై డబ్బు ఆదా చేస్తాయి. 4-5 స్టార్ రేటింగ్‌ ఏసీలను ఎంచుకోండి. ఎందుకంటే ఆయా ఏసీలు బాగా పనిచేస్తాయి.

అవసరం లేనప్పుడు ఆఫ్.. ముఖ్యంగా, మీకు ఏసీ అవసరం లేకుంటే వెంటనే మీ ఏసీని పూర్తిగా ఆఫ్ చేయండి. కేవలం రిమోట్ కంట్రోల్‌పై ఆధారపడరాదు. విద్యుత్తు వృథా కాకుండా మెయిన్ ఏసీ స్విచ్ ను ఆఫ్ చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..