Black Friday Sale: రూ.20 వేలలోపు బడ్జెట్‌లో పిచ్చెక్కించే ఫోన్లు.. ఆఫర్లలో అతి చౌకకే.. మిస్ కాకండి
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్, ఫ్లిఫ్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్స్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తోంది. ఇందులో అతి తక్కువ ధరకే భారీ తగ్గింపుతో మొబైల్స్ వస్తున్నాయి. రూ.20లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ బ్రాండ్ల ఫోన్లపై భారీ తగ్గింపు వస్తోంది.

Best Smart Phones: ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లలో బ్లాక్ ఫ్రైడే సేల్ జోరుగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపును ఇస్తున్నాయి కంపెనీలు. స్మార్ట్‌ఫోన్లు, టీవీలతో పాటు ఇంట్లోకి అవసరమ్యే ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేసేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఏకంగా 50 శాతంకుపైగా భారీ తగ్గింపుతో ఎలక్ట్రానిక్ వస్తువులు వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ అనేది ఈ రోజుల్లో అందరికీ అవసరమే. కొత్తగా స్మార్ట్‌ఫోన్ లేదా పాత ఫోన్ ఎక్సేంజ్‌లో ఇచ్చి కొత్త మొబైల్ కొనాలనుకునేవారికి భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. బ్లాక్ ఫ్రై డే సేల్‌లో రూ.20 వేలలోపు ధరల్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇక్కడ చూద్దాం.
పోకో ఎక్స్ 7
ఈ ఫోన్ 6.8-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉండగా.. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. 4 GB RAM, 128 GB స్టోరేజ్‌తో లాంచ్ చేశారు. 50MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 7000 mAh సామర్థ్యంతో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఈ ఫోన్ రూ.17,999కే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ SBI, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. 4,000 తగ్గింపు వస్తుంది.
ఐక్యూ Z10R
ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో 6.77-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. ఇక డైమెన్సిటీ 7400 5G ప్రాసెసర్ ద్వారా ఇది పనిచేస్తుంది. IMX882 వెనుక కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో దీని ధర రూ.19,498గా ఉంది. SBI లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. 1,500 తగ్గింపుతో రూ. 17,998కే కొనుగోలు చేయొచ్చు.
రియల్ మీ C85
ఈ ఫోన్‌లో 17.27 సెం.మీ (6.8-అంగుళాల) HD+ డిస్‌ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 4 GB RAM, 128 GB స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి. 50MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 7000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్ రూ. 15,499కే దీనిని విక్రయిస్తోంది విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ SBI లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో EMI లావాదేవీలపై అదనంగా రూ.4,000 తగ్గింపు లభిస్తుంది.




