
Oppo K13 5g Vs Iqoo Z10
నేటి కాలంలో అన్ని ఫీచర్లు కలిగిన మంచి ఫోన్ ను కొనాలంటే సుమారు రూ.20 వేలు పెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఆ ధరలో విడుదలైన ఒప్పో కే13, ఐక్యూ జెడ్ 10 5జీ ఫోన్ల మధ్య తేడాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.
సూపర్ డిజైన్
- ఒప్పో కే 13 5 జీ ఫోన్ మంచి లుక్ తో ఆకట్టుకుంటోంది. డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉంది. మామూలు ఫోన్ బరువుతో పోల్చితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. నీరు, దుమ్ము నిరోధకత కోసం ఐపీ 65 రేటింగ్ తోవస్తోంది.
- ఐక్యూ జె 10 కూడా మంచి లుక్ తో కనిపిస్తోంది. తేలికగా ఉండడంతో పట్టుకోవడం చాలా వీలుగా ఉంటుంది. స్కాట్ ఆల్పా గ్లాస్ ను కలిగిన డిస్ ప్లే, ఐపీ రేటింగ్ అదనపు ప్రత్యేకతలు
డిస్ ప్లే
ఒప్పో కే 13 స్మార్ట్ ఫోన్ లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఉంది. ఐక్యూ జె 10లో 6.77 అంగుళాల ఎఫ్ హెచ్ డీ + అమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. రెండు ఫోన్లలో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
స్టోరేజీ
- ఒప్పో కే 13లో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ ఏర్పాటు చేశారు.8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో పనితీరు బాగుంటుంది. అడ్రినో 850 జీపీయూకు మద్దతు ఇవ్వడంతో పాటు వేపర్ చాంబర్, గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ బాగున్నాయి.
- ఐక్యూ జె 10లో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంది. దీనిని అడ్రినో 710 జీపీయూకు జత చేశారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిలో వీసీ కూలింగ్ సిస్టమ్ లేదు.
బ్యాటరీ
- ఒప్పో కె 13 ఫోన్ లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీన్ని 80 డబ్ల్యూ సూపర్ వూక్ చార్జర్ తో చార్జింగ్ చేసుకోవచ్చు.
- ఐక్యూ జె 10లో బ్యాటరీ సామర్థ్యం కొంచెం ఎక్కువ. దీనిలో 7300 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 90 డబ్ల్యూ చార్జర్ కు మద్దతు ఇస్తుంది.
ధర
- ఒప్పో కె 13 ఫోన్ రూ.17,999కి అందుబాటులో ఉంది. దీనిలో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ తో డ్యూయల్ కెమెరా సెటప్ అమర్చారు.
- ఐక్యూ జె 10 ఫోన్ ధర రూ.21,999. దీనిలో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ బోకే కెమెరా, సెల్పీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి