AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Laptops Under 20K: రూ. 20వేలకే టాప్‌ బ్రాండ్‌ ల్యాప్‌టాప్స్‌.. విద్యావసరాలకు బెస్ట్‌ చాయిస్‌..

మార్కెట్లో పెద్ద ఎత్తున ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిల్లో అధిక నాణ్యత, మంచి ఫీచర్లు కలిగిన ల్యాప్‌ టాప్‌ ను కొనుగోలుచేయడం కాస్త కస్టమైన పనిగామారింది. పైగా కాస్త మంచి స్పెసిఫికేషన్లున్న ల్యాప్‌ టాప్‌ ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో చాలా తక్కువ ధరలో మంచి ల్యాప్‌టాప్‌, ముఖ్యంగా విద్యార్థుల అవసరాలకుఅనుగుణంగా ల్యాప్‌ టాప్‌ లను మీకు జాబితా చేసి అందిస్తున్నాం.

Best Laptops Under 20K: రూ. 20వేలకే టాప్‌ బ్రాండ్‌ ల్యాప్‌టాప్స్‌.. విద్యావసరాలకు బెస్ట్‌ చాయిస్‌..
Hp Notebook
Madhu
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 04, 2024 | 6:32 PM

Share

ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. స్కూల్‌ విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకూ అందరూ వీటిని వినియోగిస్తు‍న్నారు. దీంతో మార్కెట్లో పెద్ద ఎత్తున ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిల్లో అధిక నాణ్యత, మంచి ఫీచర్లు కలిగిన ల్యాప్‌ టాప్‌ ను కొనుగోలుచేయడం కాస్త కస్టమైన పనిగామారింది. పైగా కాస్త మంచి స్పెసిఫికేషన్లున్న ల్యాప్‌ టాప్‌ ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో చాలా తక్కువ ధరలో మంచి ల్యాప్‌టాప్‌, ముఖ్యంగా విద్యార్థుల అవసరాలకుఅనుగుణంగా ల్యాప్‌ టాప్‌ లను మీకు జాబితా చేసి అందిస్తున్నాం. కేవలం రూ. 20,000 ధరలోనే మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ ల్యాప్‌టాప్‌లు ఇవి..

డెల్ లాటిట్యుడ్‌ ల్యాప్‌టాప్..

వేగవంతమైన కోర్‌ ఐ4 6260యూ ప్రాసెసర్‌ కావాలనుకునేవారికి ఇది బెస్ట్‌ ఎంపిక. దీనిలో 8జీబీ ర్యామ్‌, విండోస్‌ 10 ఆధారంగా పనిచేస్తుంది. స్మూత్‌ కనెక్టివిటీ, మంచి పనితీరు కలిగిన సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇది బాగా ఉపకరిస్తుంది. డెల్ ల్యాప్‌టాప్ ధర రూ. 19990గా ఉంది. దీనిలో 14.1 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. హార్డ్‌ డిస్క్‌ సైజ్‌ 256జీబీ ఉంటుంది.

హెచ్‌పీ 255 జీ9(840టీ7పీఏ) నోట్‌బుక్‌..

ఈ ల్యాప్‌ టాప్‌ఏఎండీ అథ్లాన్ సిల్వర్ 3050యూ ప్రాసెసర్‌ ఉంటుంది.. మెమరీలో 4 జీబీ ర్యామ్‌, 256జీబీ మెమరీతో వస్తుంది. స్క్రీన్ పరిమాణం 15.6 అంగుళాలు ఉంటుంది. హెడ్‌డీ (1366 x 768), మైక్రో-ఎడ్జ్ బెజెల్, మీ కళ్లను రక్షించే యాంటీ-గ్లేర్ స్క్రీన్ ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 20,000

ఇవి కూడా చదవండి

లెనోవో థింక్‌ప్యాడ్ ల్యాప్‌టాప్..

విద్యార్థులు, గేమర్స్ ఇద్దరికీ బాగా ఉపయోగపడే ల్యాప్‌ టాప్‌ ఇది. 7వ జెన్‌ ఇంటెల్‌కోర్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌, 256జీబీ మెమెరీతో వస్తుంది. ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ 620ని కలిగి ఉంది. ఇది వెబ్‌క్యామ్, మైక్రోఫోన్‌తో పాటు 14-అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. దీని ధర రూ. 17,999గా ఉంది.

చువి హీరోబుక్ ప్రో..

ఇంటెల్‌ జెమినీ లేక్‌ ఎన్‌4020 ప్రాసెసర్‌ తో ఈ ల్యాప్‌ టాప్‌ వస్తుంది. ఇది 14ఎన్‌ఎం టెక్నాలజీ, 5 వాట్ల అల్ట్రా లో పవర్‌ డిజైన్తో వస్తుంది. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ స్పేస్‌ ఉంటుంది. బహుళ అప్లికేషన్‌లను సజావుగా అమలు చేస్తుంది. పూర్తి-పరిమాణ కీబోర్డ్ మరియు తగినంత పెద్ద ట్రాక్‌ప్యాడ్ మీ పనిని సులభతరం చేస్తాయి. పాఠశాల, వ్యాపారం, గృహ వినియోగానికి అనుకూలం. ఈ చువి ల్యాప్‌టాప్ ధర రూ. 18,990గా ఉంది.

లెనోవో థింక్‌ప్యాడ్ ల్యాప్‌టాప్..

దీనిలో ఇంటెల్‌ కోర్‌ ఐ5 5200యూ ప్రాసెసర్‌ ఉంటుంది. ఇంటెల్‌ టర్బో బూస్ట్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. 16జీబీర్యామ్‌, 256 స్టోరేజ్‌ స్పేస్‌తో వస్తుంది. డైనమిక్ ఇంటెల్ HD గ్రాఫిక్స్ 5500 మీ అన్ని పనులను ఒకే చోట నిర్వహించడానికి దోహదపడుతుంది. వెబ్‌క్యామ్, మైక్రోఫోన్‌తో పాటు 14-అంగుళాల డిస్‌ ప్లే ఉంటుంది. దీని దర రూ. 14,999గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..