
5 జీ అనేది స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్. ప్రతి ఫోన్‌లో కచ్చితంగా 5జీ టెక్నాలజీ ఉండేలా స్మార్ట్ ఫోన్ తయారీదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని నగరాల్లో టెలికాం ఆపరేటర్లు 5 జీ నెట్ వర్క్‌ను అందిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం 5 జీ ఫోన్లపై మార్కెట్‌లో క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా టెలికాం ఆపరేటర్లు 4జీ ధరలకే 5 జీ సేవలను అందించడంతో మరింత ప్రాచుర్యం పెరిగింది. అయితే ఇప్పటికే ఫోన్స్ ఉన్న వారు 5జీ అధునాతన స్పీడ్‌కను అందుకోడానికి తక్కువ ధరల్లో అందుబాటులో ఉండే 5 జీ ఫోన్ల గురించి చెక్ చేస్తున్నారు. కాబట్టి భారత్‌లో బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉండే 5 జీ ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.
ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. మీడియా టెక్ డైమన్సిటీ 810 చిప్ సెట్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 4 జీబీ ర్యామ్ ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎక్కువ సేపు ఫోన్ పని చేస్తుంది. అలాగే 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వల్ల ఫొటో లవర్స్ ఈ ఫోన్ అధికంగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ రూ.18000 ధరలో అందుబాటులో ఉంటుంది.
6.67 అంగుళాల ఫుల్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్‌తో వస్తుంది. అలాగే 6 జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ రూ.13,000 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లేతో వచ్చే ఈ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే 6 జీబీ ర్యామ్ తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటర్ ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఫొటో లవర్స్ ఈ ఫోన్ విపరీతంగా ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని తగ్గింపులతో కలిపి ఈ ఫోన్ రూ.14,000 ధరకు అందుబాటులో ఉంటుంది.
6.4 అంగుళాల ఎమో ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో వచ్చే 6 జీబీ ర్యామ్ వల్ల ఈ ఫోన్ చాలా స్పీడ్‌గా పని చేస్తుంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వల్ల ఎక్కువ సేపు చార్జింగ్ చింత లేకుండా ఉంటుంది. అలాగే 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా వినియోగదారులను ఆకట్టుకుంటాయి. ఈ ఫోన్ అన్ని తగ్గింపులతో రూ.15,000 ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది
6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్లో మీడియా టెక్ 810 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే 4 జీబీ ర్యామ్‌తో పాటు 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అలాగే 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్‌కు ఉన్న అదనపు ప్రత్యేకతలు. ఈ ఫోన్ రూ.13,000కు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..