Cyber Crime: మీ సిస్టం ఐపీ అడ్రస్‎ను ఇతరులతో పంచుకుంటున్నారా? అంతే సంగతులు..

| Edited By: Srikar T

Mar 08, 2024 | 9:41 PM

మనం వాడే ప్రతి కంప్యూటర్‎కు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐపీ అడ్రస్‎ను ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఐపి అడ్రస్ కనుక ఇతరుల చేతికి వెళ్లిపోతే అనేక నేరాలు జరిగే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన ఐపీ అడ్రస్ ద్వారా మనకు తెలియకుండానే మన సిస్టం యాక్సిస్ చేసే ఆవకాశం నిందితుల చేతిలోకి వెళ్ళిపోతుంది.

Cyber Crime: మీ సిస్టం ఐపీ అడ్రస్‎ను ఇతరులతో పంచుకుంటున్నారా? అంతే సంగతులు..
Computer Ipaddress
Follow us on

మనం వాడే ప్రతి కంప్యూటర్‎కు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐపీ అడ్రస్‎ను ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఐపి అడ్రస్ కనుక ఇతరుల చేతికి వెళ్లిపోతే అనేక నేరాలు జరిగే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన ఐపీ అడ్రస్ ద్వారా మనకు తెలియకుండానే మన సిస్టం యాక్సిస్ చేసే ఆవకాశం నిందితుల చేతిలోకి వెళ్ళిపోతుంది.

ఐపీ అడ్రస్ ద్వారా చేయగలిగే నేరాలు..

ఒకవేళ ఇతరులకు మన ఐపి అడ్రస్ నెంబర్‎ను షేర్ చేస్తే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ మనము ఏమీ ఆలోచించకుండా మన ఐపి అడ్రస్‎ను కనుక ఇతరులతో పంచుకుంటే మనం వాడే కంప్యూటర్‎ను అవతలి వ్యక్తి చేతికి ఇచ్చినట్లే. మన ఐపీ అడ్రస్ ఇతరుల దగ్గర ఉండటం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని వెబ్సైట్లను యాక్సిస్ చేయకుండా అడ్డంకులు సృష్టిస్తారు. మన జియో లోకేషన్ పూర్తిగా నిషేధించబడుతుంది. సంబంధంలేని యాడ్స్ మన వెబ్సైట్లో కనిపిస్తుంటుంది. మనం చేసే ప్రతి ఆక్టివిటీని ట్రేస్ చేస్తూ ఉంటారు. మన కంప్యూటర్‎లో ఉన్న పర్సనల్ డేటా మొత్తం వారికి తెలిసిపోతుంది. మన డేటా ఉపయోగించి అక్రమాలకు పాల్పడే ఆస్కారం ఉంది.

మన ఐపి అడ్రస్ తెలుసుకోవాలంటే ఇలా..

కంప్యూటర్లోని స్టార్ట్ menu కు వెళ్లి సెర్చ్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ఎంటర్ కొడితే మన ఐపి అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఐపీ అడ్రస్ మన వరకు తెలిస్తే ఎమీ కాదు. కానీ కొన్నిసార్లు మన ఐపి అడ్రస్‎ను వాడుకొని మన కంప్యూటర్‎ను వారి చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఐపీ అడ్రస్ నెంబర్‎ను ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..