- Telugu News Technology These are best budget friendly smartwatches in India, check details in telugu
Smartwatches: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. మీ మణికట్టుకు స్మార్ట్ లుక్ తెచ్చే వాచ్‌లు ఇవి..
వాచ్ లు గతంలో కేవలం టైం చూసుకోవడానికి మాత్రమే ఉపయోగపడేవి. ఇప్పుడు అనేక ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లుగా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఒక విధంగా స్మార్ట్ ఫోన్ల అతి చిన్న రూపమే స్మార్ట్ వాచ్ అని చెప్పవచ్చు. మీ మణికట్టుకు స్టైలిష్ లుక్ ని తీసుకొచ్చే ఈ వాచ్ లలో కాలింగ్, ఫిట్ నెస్, హార్ట్ బీట్, బీపీ ట్రాకర్ల ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ లలో తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకూ అనేక రకాలున్నాయి. ఈ క్రమంలో అతి తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు ఉన్న వాచ్ లను మీకు అందిస్తున్నాం. పైగా ఆయా వాచ్ లపై ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో పలు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Updated on: Apr 14, 2024 | 4:56 PM

ఫైర్ బోల్ట్ క్వెస్ట్(Fire-Boltt Quest).. ఫైర్ బోల్ట్ క్వెస్ట్ స్మార్ట్ వాచ్ 1.39 అంగుళాల ఫుల్ టచ్ డిస్ ప్లేతో స్లైలిష్ గా ఉంది. జీపీఎస్ ట్రాకింగ్, బ్లూటూల్ కాలింగ్, బయట వాతావరణాన్ని తట్టుకునే డిజైన్ దీని ప్రత్యేకతలు. వందకు పైగా స్పోర్ట్స్ మోడళ్లలో లభించే ఈ వాచ్ ఆరోగ్యం, ఫిట్ సెస్ తదితర విషయాలలో ఎంతో సహాయంగా ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు ఏడు రోజులు పని చేస్తుంది. దీని ధర రూ.2,329

టైమెక్స్ ఐకనెక్ట్ (TIMEX iConnect EVO+).. ఈ వాచ్ కు 2.04 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ప్రత్యేక ఆకర్షణ. బ్లూటూత్ కాలింగ్ సౌకర్యం ఉంది. ఫిట్ నెస్, హార్ట్ బీట్, బీపీ, స్లీప్ ట్రాకర్లతో పాటు కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. దీని బ్యాటరీ దాదాపు 7 రోజులు పని చేస్తుంది. అయితే పెద్ద డిస్ ప్లే అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. ఈ వాచ్ ధర 2,395.

రెడ్ మీ స్మార్ట్ వాచ్ 3 యాక్టివ్ (Redmi SmartWatch 3 Active).. ఈ వాచ్ బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 12 రోజులు పనిచేస్తుంది. 1.83 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లేతో ఆకట్టుకుంటుంది. దీని ద్వారా వందకు పైగా ఫిట్ నెస్ వర్కవుట్లు చేసుకోవచ్చు. హార్ట్ బీట్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది. వాటర్ రెసిస్టెంట్ దీని అదనపు ప్రత్యేకత. ఈ వాచ్ 2,999కి అందుబాటులో ఉంది.

నాయిస్ వివిడ్ కాల్ 2(Noise VividCall 2).. ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ ఏడు రోజులు. 1.85 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, బీటీ కాలింగ్, వాటర్ ప్రూఫ్ దీని ప్రత్యేకతలు. స్లీప్ ట్రాకింగ్, ఎలైట్ బ్లాక్ డిజైన్ లో ఆకట్టుకుంటుంది. ఫిట్ నెస్ ట్రాకర్ కూడా ఉంది. మిగిలిన వాచ్ లతో పోల్చితే దీని బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీని ధర రూ.1,499.

వైబెజ్ బై లైఫ్ లాంగ్(Vibez by Lifelong).. ఈ వాచ్ బ్యాటరీ సామర్థ్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు. దాదాపు 60 రోజుల పాటు పనిచేస్తుంది. 2.02 అంగుళాల ఆల్ట్రా హెచ్ డీ డిస్ ప్లే, బీటీ కాలింగ్, స్టెయిన్ లెస్ స్టీల్ డయల్ డిజైన్, పసిఫిక్ బ్లాక్ కలర్ లో అద్భుతంగా ఉంది. అయితే పెద్ద డయల్ అందరికీ నప్పకపోవచ్చు. ఈ వాచ్ రూ.2,499 ధరకు అందుబాటులో ఉంది.




