BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు అలర్ట్‌.. 5జీ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయంటే..

|

Jan 05, 2023 | 9:33 PM

దేశంలో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. జియో, ఎయిర్‌టెల్‌తో పాటు పలు ప్రైవేటు టెలికాం సంస్థలు యూజర్లకు 5జీ సేవలను తీసుకొచ్చాయి. చిన్న చిన్న పట్టణాలకు కూడా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించే..

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు అలర్ట్‌.. 5జీ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయంటే..
Bsnl 5g
Follow us on

దేశంలో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. జియో, ఎయిర్‌టెల్‌తో పాటు పలు ప్రైవేటు టెలికాం సంస్థలు యూజర్లకు 5జీ సేవలను తీసుకొచ్చాయి. చిన్న చిన్న పట్టణాలకు కూడా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించే పనిలో టెలికం సంస్థలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవలను ఎప్పుడు ప్రారంభిస్తుందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే 2023లో 5జీ సేవలు ప్రారంభమవుతాయని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ మరింత ఆలస్యంకానుంది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అధికారికంగా తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవలను 2024లో ప్రారంభించబోతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఒడిశాలలో జియో, ఎయిర్‌టెల్ 5జీ సేవలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి గురువారం ప్రారంభించిన తర్వాత అశ్వనీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌చేసే విషయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే టీసీఎస్‌, సి-డాట్‌తో కూడిన కన్సార్టియాన్ని షార్ట్‌ లిస్ట్‌చేసిందని మంత్రి తెలిపారు.

ఇక నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఏడాది సమయం పడుతుండడంతో బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి రావాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఒడిశా రాజధాని భువనేశ్వర్‌, కటక్‌ నగరాల్లో ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభమయ్యాయని, రాబోయే రెండేళ్లలో ఒడిశా అంతటా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని వైష్ణవ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..