Google Maps: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన గూగుల్‌ మ్యాప్స్‌.. దీంతో కళ్ల సమస్యకు చెక్‌..

|

Feb 24, 2021 | 1:13 PM

Google Maps Dark Mode: టెక్‌ కంపెనీలు రోజుకో కొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా సరికొత్త ఫీచర్లతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చిందే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌...

Google Maps: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన గూగుల్‌ మ్యాప్స్‌.. దీంతో కళ్ల సమస్యకు చెక్‌..
Follow us on

Google Maps Dark Mode: టెక్‌ కంపెనీలు రోజుకో కొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా సరికొత్త ఫీచర్లతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చిందే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌.
మొబైల్‌ ఫోన్లను ఉపయోగిస్తున్న వారిలో ఎక్కువ ఎదుర్కొనే సమస్యల్లో కంటి సంబంధిత సమస్యలు ప్రధానమైనవి. స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ కారణంగా కంటికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. ఇందుకోసమే టెక్‌ కంపెనీలు డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికే చాలా యాప్‌లు ఈ కొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందించాయి. ఇదిలా ఉంటే తాజాగా గూగుల్‌ మ్యాప్స్‌ కూడా ఈ కొత్త ఫీచర్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి థీమ్‌లో ‘ఆల్వేస్‌ ఇన్‌ డార్క్‌ థీమ్‌’ అనే ఫీచర్‌ను ఎంచుకుంటే.. మ్యాప్స్‌ను డార్క్‌ మోడ్‌లో చూసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఫీచర్‌ యూజర్‌ కళ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడంతోపాటు, ఆకర్షణీయంగా ఉంటుందని గూగుల్‌ ప్రతినిధులు చెబుతున్నారు. డార్క్‌ మోడ్‌ వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గడంతోపాటు బ్యాటరీ కూడా సేవ్‌ అవుతుందని గూగుల్‌ చెబుతోంది. మరి ఈ కొత్త ఫీచర్‌ను మీరూ ఓసారి ప్రయత్నించండి.

Also Read: క్రెడిట్ కార్డు వాడటం వల్ల లాభమా.. నష్టమా? అసలు బ్యాంకులు ఈ కార్డులను ఎందుకు జారీ చేస్తాయో తెలుసా.. ఒక్కసారి పరిశీలించండి..