ఫోన్‌లో ఈ రెండు ఆప్షన్లు ఆన్‌లో ఉంటే.. ఫోన్‌ చోరీ అయితే ఈజీగా ట్రాక్‌ చేయొచ్చు! డేటా కూడా సేఫ్‌..

స్మార్ట్‌ఫోన్ దొంగతనం నుండి మీ వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి రెండు ముఖ్యమైన Android సెట్టింగ్‌లను ఈ ఆర్టికల్ వివరిస్తుంది. "థెఫ్ట్ డిటెక్షన్ లాక్" ఫీచర్ ఫోన్ చోరీ అయినప్పుడు దాన్ని ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. అదనంగా, పవర్ ఆఫ్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం అనే ఫీచర్ ఫోన్‌ను ఆఫ్ చేయకుండా నిరోధిస్తుంది, దీనివల్ల ట్రాకింగ్ సులభమవుతుంది.

ఫోన్‌లో ఈ రెండు ఆప్షన్లు ఆన్‌లో ఉంటే.. ఫోన్‌ చోరీ అయితే ఈజీగా ట్రాక్‌ చేయొచ్చు! డేటా కూడా సేఫ్‌..
Phone Security

Updated on: Jul 07, 2025 | 4:27 PM

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. మన చేతికి ఆరో వేలిగా మారిపోయింది. ఫోన్‌ లేకుండా ఒక గంట కూడా ఉండలేని పరిస్థితి దాపురించింది. అయితే మన ఫోన్‌లో మన ఫోటోలు, బ్యాంక్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలు, పత్రాలు, వ్యక్తిగత డేటా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ చోరీకి గురైతే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో ఊహించుకోండి. అటువంటి పరిస్థితిలో మన స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని ముఖ్యమైన సెట్టింగ్‌లను ముందుగానే ఆన్ చేయడం ముఖ్యం, తద్వారా ఫోన్ చోరీకి గురైనా దానిని సులువుగా ట్రాక్ చేయవచ్చు. డేటా కూడా సురక్షితంగా ఉంటుంది. మరి ఆ రెండు సెట్టింగ్‌లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తెఫ్ట్‌ ఐడెంటిఫై లాక్‌

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో తెఫ్ట్‌ ఐడెంటిఫై లాక్‌ను సెటప్ చేయడానికి ముందుగా మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి..
  • క్రిందికి స్క్రోల్ చేసి Google సర్వీసెస్‌పై క్లిక్‌ చేయండి.
  • తరువాత అన్ని సేవలపై క్లిక్ చేయండి.
  • ఇక్కడ దిగువన మీరు దొంగతనం రక్షణ అనే ఫీచర్‌ ఉంటుంది.
  • దీనిపై క్లిక్ చేసిన తర్వాత, థెఫ్ట్ డిటెక్షన్ లాక్‌ని ఆన్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత, ఎవరైనా మీ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన వెంటనే, ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఫోన్ ఆటోమెటిక్‌గా లాక్ అవుతుంది. దొంగ దానిని అన్‌లాక్ చేయలేడు. ఇది మీ డేటాను సురక్షితంగా ఉంచుతుంది. ఫోన్‌ను ట్రాక్ చేయడం కూడా సులభం అవుతుంది.

స్విచ్‌ ఆఫ్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ ఆప్షన్‌..

  • పవర్ ఆఫ్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.
  • దీన్ని సెట్ చేయడానికి, మీరు మరోసారి ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి..
  • తరువాత సెర్చ్‌ బాక్స్‌లో టైప్ చేయండి.
  • మోర్‌ ప్రొడెక్షన్‌లో పవర్ ఆఫ్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫీచర్‌ని ఆన్ చేయండి.
  • ఈ ఫీచర్‌తో దొంగ మీ ఫోన్‌ను దొంగిలించి, దాన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే, పాస్‌వర్డ్‌ను నమోదు చేయకుండా అతను ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయలేడు. ఇది ఫోన్ ఆన్‌లో ఉండటం వలన దాన్ని ట్రాక్ చేయడానికి వీలుంటుంది. ఆ ఫోన్‌ ఎక్కడుందో కూడా కనుక్కోవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి