
Elon Musk Starlink: ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ భారతదేశంలో పనిచేయడానికి ప్రభుత్వ అనుమతి పొందింది. కానీ అది భారతీయ వినియోగదారుల డేటాను దేశంలోనే ఉంచే కఠినమైన భద్రతా అవసరాలకు అంగీకరించిన తర్వాత మాత్రమే టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఉపగ్రహ ఇంటర్నెట్ కంపెనీకి యూనిఫైడ్ లైసెన్స్ (UL)ను మంజూరు చేసింది. విదేశాలలో భారతీయ డేటాను కాపీ, డీక్రిప్ట్ చేయకపోవడం వంటి సెక్యూరిటీకి సంబంధించిన షరతులతో సహా దేశీయ చట్టాలను తప్పనిసరిగ్గా పాటించేలా ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ కంపెనీ అంగీకరించిన తర్వాత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ అన్నారు.
ట్రాఫిక్ రూటింగ్ నిషేధానికి కంపెనీ అంగీకారం:
ఈ స్టార్‌లింక్ నెట్‌వర్క్ విషయంలో ట్రాఫిక్ రూటింగ్‌పై షరతులు విధించింది. విదేశాలలో ఏర్పాటు చేసిన ఏదైనా వ్యవస్థలో భారతీయ వినియోగదారుల ట్రాఫిక్ రూటింగ్ నిషేధానికి కూడా కంపెనీ అంగీరించిందని తెలిపారు. భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో ఎర్త్ స్టేషన్ గేట్‌వేలను ఏర్పాటు చేయడం కూడా తప్పనిసరి అని మంత్రి పేరకొన్నారు.
ఇది కూడా చదవండి: Expensive Fruits: ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండు ఏది? దీని ధర రూ.24 లక్షలు!
ఈ ఎర్త్ స్టేషన్ గేట్‌వేల ద్వారా ఉపగ్రహం నుంచి వినియోగదారులకు ఇంటర్నెట్ నేరుగా మళ్లించడం వీలు కలుగుతుంది. అన్ని శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీలకు వర్తించే భద్రతా సూచనలతో సహా నిబంధనలు, షరతులకు అంగీకరించిన తర్వాతే స్టార్‌లింక్‌కు టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) యూనిఫైడ్ లైసెన్స్(యూఎల్) మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. అయితే దేశంలో ఎర్త్ స్టేషన్ గేట్‌వేలను ఏర్పాటు చేయడం ద్వారా ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలలో డేటాను కాపీ చేయడం, డీక్రిప్షన్ చేయడం వీలుండదు. దేశం వెలుపల ఉన్న ఏ సిస్టమ్ లేదా సర్వర్‌కు యూజర్ ట్రాఫిక్ పంపడం కుదరదని మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: Dussehra-2025: దసరా పండగ ఎప్పుడు? అక్టోబర్ 1న లేదా 2వ తేదీనా..?
ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ ధరలతో సహా స్పెక్ట్రమ్ కేటాయింపు నిబంధనలు, షరతులపై టెలికాం శాఖ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి సిఫార్సులను కోరిందని చెప్పారు. అన్ని శాట్‌కామ్ ఆపరేటర్లకు వర్తించే షరతుల ప్రకారం.. స్టార్‌లింక్ భారతదేశంలో ఏర్పాటు చేసిన ఎర్త్ స్టేషన్ గేట్‌వేల ద్వారా సిగ్నల్‌లను రూట్ చేయాలి. లైసెన్స్‌ను క్లియర్ చేసే ముందు ధరతో సహా స్పెక్ట్రమ్ కేటాయింపుపై ప్రభుత్వం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇన్‌పుట్‌ను కూడా కోరింది. మే 9న ట్రాయ్ తన సిఫార్సులను ఇచ్చింది.
కనెక్టివిటీకి మించి కొత్త రంగం సామర్థ్యాన్ని గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు రాబోయే రంగం, ఏదైనా కొత్త ఆర్థిక కార్యకలాపాలు చేసినట్లుగా, ఇది దేశంలో ఉపాధిని కూడా సృష్టిస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి