
ఎక్కడో ఉన్న వాళ్లు చేతిలో రిమోట్‌తో మన మెదడును కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది.? వారి కమాండ్స్‌కి అనుగుణంగా మనం ఆలోచనలు మారితే.? ఏంటి.. ఏదైనా సైన్స్ ఫిక్షన్ సినిమా కథ గురించి చెబుతున్నారని అనుకుంటున్నారా.? ఇది కథ కాదు.. నిజంగా నిజం. రిమోట్ సహాయంతో బ్రెయిన్‌ను కంట్రోల్ చేసే టెక్నాలజీని పరిశోధకులు అభివృద్ధి చేశారు. టీవీ ఛానెల్స్‌ను మార్చినంత సులభంగా మెదడును కంట్రోల్ చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఈ అద్భుతాన్ని నిజం చేసే దిశగా ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే పరిశోధకులు ‘లాంగ్ రేంజ్’, లార్జ్ వాల్యూమ, రిమోట్ మైండ్ కంట్రోల్ అనే పరికరాన్ని సృష్టించారు. ఇది వరకు ఎప్పుడు కనీవిని ఎరగని పరికరాన్ని కొరియాకు చెందిన ఇన్‌స్టిట్యూట ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరానికి అయస్కాంత క్షేత్రాల సహాయంతో దూరంగా నుంచి మానవ మెదడును నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుందని అంటున్నారు. ఈ పరికరాన్ని ఎలుకల్లో ప్రాక్టికల్‌గా కూడా పరీక్షిచారు. ఆడ ఎలుకలో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ సహాయంతో ఆకలి తగ్గించేందుకు రూపొందించిన అయస్కాంత క్షేత్రాలని ఎలుకల్లో ప్రయోగించారు. దీంతో ఎలుకలు 10 శాతం బరువు తగ్గడం విశేషం. అంటే ఇకపై బరువు తగ్గాలనుకుంటే జిమ్‌ల బాట పట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. రిమోట్‌లో ఒక చిన్న బటన్ ద్వారా బరువు తగ్గొచ్చు. ...