
ప్రముఖ టెక్ దిగ్గజం ఈ ఏడాది టాప్ డీల్స్ ను అందించేందుకు కొత్త ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించింది. మండే వేసవిలో కూల్ కూల్ ఆఫర్లను అందిస్తోంది. శామ్సంగ్ తన అతి పెద్ద సమ్మర్ సేల్ ‘ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్’ ను ప్రకటించింది. ఈ సేల మే ఒకటో తేదీన ప్రారంభమైంది. ఈ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ లో అన్ని గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ సేల్ ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే శామ్సంగ్ అధికారిక వెబ్ సైట్ తో పాటు శామ్సంగ్ షాప్ యాప్, శామ్సంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ లకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు ఇదే సరైన సమయం. ఎంచుకున్న శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై 41% వరకు తగ్గింపును ఫ్యాబ్ గ్రాబ్ సేల్ అందిస్తోంది. వీటిలో ప్రసిద్ధ మోడళ్లు ఉన్నాయి. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, గెలాక్సీ ఎస్25 అల్ట్రా, ఎస్25+, ఎస్25, గెలాక్సీ ఎస్24 అల్ట్రా, ఎస్24, ఎస్24 ఎఫ్ఈ, గెలాక్సీ ఏ56 5జీ, ఏ36 5జీ, ఏ55 5జీ, ఏ35 5జీ, గెలాక్సీ ఎం16, ఎం06, గెలాక్సీ ఎఫ్16, ఎఫ్06. వీటిపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక మీరు వీటి కొనుగోలుపై సులభమైన నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా పొందవచ్చు. ఫోల్డబుల్స్ కోసం 24 నెలల వరకు, ఎస్ సిరీస్ ఫోన్‌లకు 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంటుంది.
కేవలం స్మార్ట్ ఫోన్లపై మాత్రమే కాక ఎంపిక చేసిన టాబ్లెట్‌లు, యాక్సెసరీలు, ధరించగలిగే వస్తువులపై కూడా శామ్‌సంగ్ 65% వరకు ధరలను తగ్గిస్తోంది. మీరు గెలాక్సీ ట్యాబ్ ఎస్10ఎఫ్ఈ ని కొనుగోలు చేస్తే, మీకు రూ. 2,999 విలువైన 45వాట్ల ఛార్జర్ ఉచితంగా లభిస్తుంది. అలాగే ల్యాప్‌టాప్ ప్రియులు గెలాక్సీ బుక్4, బుక్5 సిరీస్ లపై 35శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు. అంతేకాక ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ.17,490 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి