Samsung: శామ్‌సంగ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది.. నీటిలో పడినా ఏం కాదు తెలుసా..?

|

Mar 08, 2021 | 5:31 PM

Samsung galaxy xcover 5 smartphone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం.. శాంసంగ్ మరో అద్భుతమైన రగ్గడ్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 5. మిలటరీ గ్రేడ్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ అత్యాధునిక..

Samsung: శామ్‌సంగ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది.. నీటిలో పడినా ఏం కాదు తెలుసా..?
Follow us on

Samsung galaxy xcover 5 smartphone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం.. శాంసంగ్ మరో అద్భుతమైన రగ్గడ్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 5. మిలటరీ గ్రేడ్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. 2017లో వచ్చిన గెలాక్సీ ఎక్స్‌కవర్ 4కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి యూరోప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను 329 యూరోలుగా అంటే భారత కరెన్సీలో సుమారు రూ.33,300 నిర్ణయించారు. మార్చి 12 నుంచి అక్కడ ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. త్వరలోనే ఈ ఫోన్ భారత మార్కెట్‌లోకి కూడా లాంచ్ అవుతుందని పేర్కొంటున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎక్స్‌కోవర్‌ను లాంచ్ చేయడంతో స్మార్ట్ ఫోన్ ఫ్యాన్స్ చూపు మొత్తం ఈ రగ్గడ్ స్మార్ట్ ఫోన్‌పై పడింది. ఇది ఒకే కలర్ అంటే.. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులోకి రానుంది. అయితే సంస్థ అంతర్జాతీయ అమ్మకాల వివరాలు, లభ్యతను పంచుకోలేదు.

శామ్సంగ్ గెలాక్సీ ఎక్స్‌కోవర్ 5.. ఫీచర్లు..
శామ్సంగ్ గెలాక్సీ ఎక్స్‌కోవర్ 5 ఆండ్రాయిడ్ 11 వెర్షన్.. 5.3-అంగుళాల హెచ్‌డి + టిఎఫ్‌టి డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. దీనిలో ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 SoCతో.. 4GB ర్యామ్, 64GB డేటా సామర్థ్యంతో వస్తుంది. బ్యాక్ కెమెరా 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఎఫ్ / 1.8 లెన్స్‌తో ఉంటుంది. గెలాక్సీ ఎక్స్‌కోవర్ 5 ఫ్రంట్ కెమెరా.. 5 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఎఫ్ / 2.2 లెన్స్‌తో వస్తుంది. 3,000 ఇన్‌బిల్ట్ బ్యాటరీ, సీటైప్ ఛార్జర్, ఫేస్ రికగ్నేషన్ సెన్సార్ కూడా దీనికి అందుబాటులో ఉంది. అయితే ఈ గెలాక్సీ ఎక్స్‌కోవర్ 5 స్మార్ట్ ఫోన్ నీటిలో పడినా ఏం కాదని శామ్‌సంగ్ తెలిపింది.

 

Also Read: