Robo Police: ఇక నుంచి వీధుల్లో రోబోల గస్తీ.. పోలీసులతో పని లేదు!

|

Oct 07, 2021 | 10:12 PM

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. మనుషులతో పనిలేకుండా అన్ని పనులను చేసే రోబోలను అభివృద్ధి చేసే దిశలో అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Robo Police: ఇక నుంచి వీధుల్లో రోబోల గస్తీ.. పోలీసులతో పని లేదు!
Robo Police
Follow us on

Robo Police: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. మనుషులతో పనిలేకుండా అన్ని పనులను చేసే రోబోలను అభివృద్ధి చేసే దిశలో అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విధమైన టెక్నాలజీ విషయంలో సింగపూర్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అక్కడ ఇప్పటికే చాలా పనులకు రోబోలను సిద్ధం చేశారు. ఇంట్లో నిత్యం అవసరం అయ్యే పనులను చేయడమే కాకుండా.. రెస్టారెంట్స్ లో సప్లయర్ గా పనిచేసే రోబోలు కూడా ఇప్పటికే రెడీ అయ్యాయి. ఇప్పుడు మరో ముందడుగు వేసి పోలీస్ రోబోలు సిద్ధం చేస్తున్నారు సింగపూర్ పరిశోధకులు.

షాపింగ్‌ మాల్స్‌, బస్టాండ్స్‌, రైల్వేస్టేషన్స్‌లోనూ ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగడం మనం తరుచుగా చూస్తుంటాం. వాటిని అరికట్టడం కోసం పోలీసులు, అధికారులు ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి సంఘటనలు తలెత్తకుండా సరికొత్త రోబో టెక్నాలజీతో చెక్‌ పెట్టాలని సింగపూర్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

సింగపూర్‌లోని హౌసింగ్ ఎస్టేట్, షాపింగ్ మాల్స్‌లో రెండు చక్రాల రోబోతో గత మూడు వారాలుగా గస్తీ నిర్వహించారు. అక్కడ మాల్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పర్యవేక్షించడమే కాకుండా ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఆ రోబో హెచ్చరికలు జారీ చేస్తుంది. అంతేకాదు నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం, పార్కింగ్‌ సరిగ్గా చేయకపోయినా, కరోనావైరస్‌ నేపధ్యంలో సామాజిక దూరం..లాంటి నియమాలను ఉల్లఘించకుండా హెచరికలనూ జారీ చేసేలా వీటిని రూపొందించారు. ఏడు అత్యాధునిక కెమెరాలతో నిర్మితమైన ఈ రోబోలు మనుష్యుల ముఖాలను గుర్తించడమే కాకుండా వారికి వాయిస్‌ రికార్డర్‌ ద్వారా హెచ్చరికలను కూడా జారీ చేస్తాయి. గత మూడు వారాల నంచి అధికారులు ఈ రోబోలు పని తీరుపై ట్రయల్స్‌ నిర్వహించారు. సింగపూర్‌ ప్రభుత్వాధికారులు హైపర్-ఎఫిషియెంట్, టెక్-డ్రైవ్డ్ “స్మార్ట్ నేషన్” పై దృష్టి సారించి ఈ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రోబోలను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. అయితే, సింగపూర్‌వాసులు ఈ రోబోల వల్ల శ్రామిక శక్తి తగ్గిపోతుందని, తమ గోప్యతకు భంగం వాటిల్లుతోందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛా హక్కులను కాలరాస్తుందంటూ సింగపూర్‌ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: RTA: అలా చేస్తే బస్సులు సీజ్ చేస్తాం.. ప్రైవేట్ ట్రావెల్స్‎కు ఆర్టీఏ అధికారుల హెచ్చరిక..

Dussehra Special Trains: దసరా పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైలు సర్వీసులు.. ఇవిగో వివరాలు