Google: గూగుల్‌కు 27,700 ఫిర్యాదులు.. 59వేల కంటెంట్ల తొలగింపు.. నెలవారీ నివేదిక విడుదల

|

Jul 01, 2021 | 5:28 AM

Google: సామాజిక మాధ్యమాలకు సంబంధించి కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఆయా సంస్థలు అభ్యంతరకరమైన..

Google: గూగుల్‌కు 27,700 ఫిర్యాదులు.. 59వేల కంటెంట్ల తొలగింపు.. నెలవారీ నివేదిక విడుదల
Google
Follow us on

Google: సామాజిక మాధ్యమాలకు సంబంధించి కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఆయా సంస్థలు అభ్యంతరకరమైన కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు వంటి వివరాలు నెలకోసారి అందజేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ వివరాలతో కూడిన నివేదికను విడుదల చేసిన మొదటి డిజిటల్‌ వేదిక గూగుల్‌. అయితే స్థానిక చట్టాలు, వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో తమకు భారత యూజర్ల నుంచి 27,700లకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు గూగుల్‌ తెలిపింది. వీటి ఫలితంగా 59 వేలకుపైగా కంటెంట్లను తమ సైట్‌ నుంచి తొలగించినట్లు గూగుల్ పేర్కొంది. ఈ మేరకు తొలి నెలవారీ పారదర్శక నివేదికను గూగుల్‌ బుధవారం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మాకు వచ్చే అన్ని రకాల ఫిర్యాదులు, వినతులు, వాటిపై మా స్పందన వంటి వివరాలకు సంబంధించి గూగుల్‌చాలా కాలం నుంచే నివేదిక రూపొందిస్తోందని గూగుల్‌ అధికార ప్రతినిధి తెలిపారు. 2010 నుంచి ఉన్న మా ట్రాన్స్‌పరెన్సీ నివేదికలో వీటికి సంబంధిత సమాచారం ఉందని తెలిపారు. కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా తొలిసారి నెలవారీ నివేదికను విడుదల చేసినట్లు చెప్పారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణ కోసం,కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కొత్త నియమ నిబంధనలను ప్రకటించింది. అవన్నీ కూడా వెంటనే అమల్లోకి వచ్చాయన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో గూగుల్‌, యూట్యూబ్‌కు భారతయూజర్లనుంచి 27,762 ఫిర్యాదులు అందాయని, ఇందులో అత్యధికంగా 96 శాతం కాపీరైట్‌కు సంబంధించినవే ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ట్రేడ్‌మార్క్‌కు సంబంధించి 357, పరువు నష్టానికి సంబంధించి 276 ఫిర్యాదులు వచ్చినట్లు గూగుల్‌ నివేదికలో పేర్కొంది. ఈ ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం 59,350 కంటెంట్లను తమ సైట్‌ నుంచి తొలగించినట్లు గూగుల్‌ తెలిపింది. అయితే ఈ నిబంధనలు పాటించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ట్విటర్‌ మాత్రం కొత్త నిబంధనలు అమలు చేయలేదు. దీంతో ఆ సంస్థ భారత్‌లో మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయింది. మరోవైపు జూలై 15న నెలవారీ నివేదికను విడుదల చేస్తామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి:

Radiation: సెల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల ఎలాంటి హాని ఉండదు.. తాజా పరిశోధనల్లో వెల్లడి

Whats App: వాట్సప్ ప్రైవసీకి పెద్ద పీట..వ్యూ వన్స్ పేరిట కొత్త ఫీచర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..