ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌లకు గిరాకీ పెరుగుతోంది. ప్రముఖ టెక్ కంపెనీలన్నీ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేస్తోంది. రెడ్‌మీ వాచ్ 3 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ వాచ్ త్వరలోనే మార్కెట్లో సందడి చేయనుంది. ఇప్పటికే యూరప్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 10,600గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారత్‌లో ఈ స్మార్ట్ వాచ్ మార్చ్ 30వ తేదీన లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 390*450 పిక్సెల్స్‌తో కూడిన 1.75 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్‌పై యాంటి ఫింగర్ ప్రింట్ కోటింగ్ ప్రత్యేకంగా ఇచ్చారు. అంతేకాకుండా ఇందులో హార్ట్ రేట్ సెన్సార్, రక్తంలో ఆక్సిజన్ సెన్సార్, గైరోస్కోప్, జియోమ్యాగ్నటిక్ సెన్సార్ వంటి అధునాతన ఫీచర్లు అందించారు. బ్లూటూత్ వీ5.2ని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 6.0 లేదా ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌కి సపోర్ట్ చేస్తుంది.
బ్లూటూత్ కాలింగ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో బిల్ట్‌ఇన్ మైక్రోఫోన్, కాలింగ్ కోసం స్పీకర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ వాచ్‌లో 121కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఇచ్చారు. ఈ వాచ్‌ను 5 ఏటీఎమ్ వాటర్ రెసిస్టెన్స్‌తో రూపొందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 289 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 రోజులపాటు నిర్వీరామంగా పనిచేస్తుంది. ఈ వాచ్ బరువు 37 గ్రాములుగా ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..