
స్మార్ట్ గాడ్జెట్ల విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ రియల్‌మీ భారత మార్కెట్లో కొత్త ప్రీమియం స్మార్ట్‌వాచ్ ‘రియల్‌మీ వాచ్ S5’ను విడుదల చేసింది. ఆధునిక డిజైన్, AMOLED డిస్‌ప్లే, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్, అధునాతన ఫిట్‌నెస్ ఫీచర్లతో ఈ వాచ్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. కంపెనీ ఈ వాచ్‌ను రియల్‌మీ 16T స్మార్ట్‌ఫోన్, బడ్స్ ఎయిర్ 8 ప్రో ఇయర్‌బడ్స్‌తో కలిసి ఆవిష్కరించింది. రియల్‌మీ వాచ్ S5 ధర రూ.7,999గా నిర్ణయించగా, ప్రారంభ ఆఫర్ కింద రూ.7,499కే అందుబాటులోకి తీసుకువచ్చింది. రాక్ గ్రే, సాండ్ వైట్ రంగుల్లో లభించే ఈ వాచ్ విక్రయాలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అల్యూమినియం బాడీ, పాండా గ్లాస్ రక్షణతో వాచ్‌కు ప్రీమియం లుక్‌ను ఇచ్చారు. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌తో పాటు అనేక కస్టమ్ వాచ్ ఫేస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన వినియోగదారుల కోసం 110కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 ట్రాకింగ్, నిద్ర పర్యవేక్షణ, ఒత్తిడి స్థాయి ట్రాకింగ్, మహిళల ఆరోగ్య ఫీచర్లు వంటి అనేక ఆరోగ్య పర్యవేక్షణ సాధనాలు అందించారు. 460mAh బ్యాటరీతో వచ్చిన ఈ వాచ్ సాధారణ వినియోగంలో 16 రోజుల వరకు, లైట్ మోడ్‌లో 20 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. GPS, బ్లూటూత్ కాలింగ్, 5ATM వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో ఈ వాచ్ మధ్యశ్రేణి స్మార్ట్‌వాచ్ మార్కెట్లో CMF Watch 3 Pro వంటి ఉత్పత్తులకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి