Realme Narzo 70 Turbo: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. రూ. 15వేలలోనే..

రియల్‌మీ నార్జో 70 టర్బో ఫోన్‌లో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తోకూడి సామ్‌సంగ్‌ ఐ4 ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇక ఇందులో 45 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. సెప్టెంబర్‌ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది...

Realme Narzo 70 Turbo: అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. రూ. 15వేలలోనే..
Realme Narzo 70 Turbo
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 12, 2024 | 7:02 PM

బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ నెలకొంది. రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రూ. 15 వేల మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కంపెనీలు కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ నార్జో 70 టర్బో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్‌మీ నార్జో 70 టర్బో ఫోన్‌లో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తోకూడి సామ్‌సంగ్‌ ఐ4 ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇక ఇందులో 45 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. సెప్టెంబర్‌ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ను టర్బో ఎల్లో, టర్బో గ్రీన్‌, టర్బో పర్పుల్‌ కలర్‌లో అందుబాటులోకి రానుంది.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1s80Hz రేట్, 1s80Hz రేట్ స్క్రీన్‌ను అందించారు. 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇందులో ప్రత్యేకంగా రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక 12జీబీ వరకు ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ద్వారా పవర్‌ను అందిస్తున్నారు. వర్చువల్‌గా 26 జీబీ వరకు మెమోరీని పెంచుకోవచ్చు. గేమ్స్‌కు సపోర్ట్‌ చేసేలా ఈ ఫోన్‌లో 6,050ఎమ్ఎమ్ చదరపు స్టెయిన్‌లెస్ స్టీల్ స్టీమ్ కూలింగ్ అందిస్తోంది. దీంతో ఫోన్‌ వేడెక్కదు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే 2 ఎంపీతో కూడిన పోర్ట్రెయిట్ కెమెరాను ఇచచారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, బెయిడూ, గెలిలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, వై-ఫై వంటి ఫీచర్లను అందించనున్నారు. ఇక సెక్యూరిటీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు అందించారు.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌ బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతానికి పెరుగుతుంది. ధర విషయానికొస్తే రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 16,999కు లభించనుంది. ఇక 8జీబీ + 128జీబీ, 12జీబీ + 256జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 17,999, రూ. 20,999గా నిర్ణయించారు. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 2000 డిస్కౌంట్‌ లభించనుంది. దీంతో ఈ ఫోన్‌ స్టార్టింగ్ వేరియంట్‌ రూ. 15 వేలకే లభిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..