AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RealMe Laptop: అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ మొదటి ల్యాప్‌టాప్ రియాలిటీ బుక్‌..ఈ ల్యాప్‌టాప్ ధర ఎంతంటే..

రియల్‌మీ ఈరోజు తన మొదటి ల్యాప్‌టాప్ రియాలిటీ బుక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే రియల్‌మీ తన ల్యాప్‌టాప్ పై అంచనాలు పెంచేసింది.

RealMe Laptop: అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ మొదటి ల్యాప్‌టాప్ రియాలిటీ బుక్‌..ఈ ల్యాప్‌టాప్ ధర ఎంతంటే..
Realme Laptop
KVD Varma
|

Updated on: Aug 18, 2021 | 7:35 PM

Share

RealMe Laptop: రియల్‌మీ ఈరోజు తన మొదటి ల్యాప్‌టాప్ రియాలిటీ బుక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే రియల్‌మీ తన ల్యాప్‌టాప్ పై అంచనాలు పెంచేసింది. వినియోగదారులు దీనికోసం ఎదురుచూసేలా చేసింది. మరి వారు ఎదురుచూసిన విధంగా ఈ ల్యాప్‌టాప్ ఉందా? రియల్‌మీ రియాలిటీ బుక్ ఎలా ఉంది? దీని ధర ఎంత వంటి వివరాలు తెలుసుకుందాం.

రియల్‌మీ బుక్ డిజైన్, ఫీచర్లు..స్పెసిఫికేషన్‌లు

డిజైన్: ఈ ల్యాప్‌టాప్‌కు చాలా స్లిమ్ డిజైన్ ఇచ్చారు. దీని మందం 15.5 మిమీ, బరువు 1.38 కిలోలు. అదే సమయంలో, ఆపిల్ మాక్‌బుక్ తో పోల్చి చూస్తే ఇది మరింత స్లిమ్ అని చెప్పవచ్చు. ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ మందం 16.1 మిమీ, బరువు 1.29 కిలోలు. మరోవైపు, మాక్‌బుక్ ప్రో 15.6 మిమీ మందం, 1.40 కిలోల బరువు ఉంటుంది. రియల్‌మీ ల్యాప్‌టాప్‌ మెటల్ బాడీతో వస్తోంది. అందువల్ల ఇదీ స్ట్రాంగ్ గా ఉంటుంది.

డిస్‌ప్లే: ల్యాప్‌టాప్ 14-అంగుళాల 2K ఫుల్ విజన్ IPS డిస్‌ప్లేతో 400 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంటుంది.  దీని డిస్ప్లే నిష్పత్తి 3: 2. అదే సమయంలో, బాడీ టు స్క్రీన్ నిష్పత్తి 90%. ఇది ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ కంటే 8% ఎక్కువ. మాక్‌బుక్ ఎయిర్ బాడీ టు స్క్రీన్ నిష్పత్తి 82%.

ప్రాసెసర్: ఐరిస్ XE ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో 11 వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 చిప్‌సెట్ ఈ ల్యాప్‌టాప్‌కు అమర్చారు. ఇక ఈ ల్యాప్‌టాప్ 512GB వరకు SSD స్టోరేజ్ అలాగే, 8GB RAM వరకు లభిస్తుంది. ఇది డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది ల్యాప్‌టాప్‌ను వేడెక్కకుండా చూస్తుంది. ఇది వైఫై -6 టెక్నాలజీ కనెక్టివిటీతో అందుబాటులోకి వస్తుంది.

బ్యాటరీ: 65W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. దీని కారణంగా ఇది 30 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్‌లో 11 గంటల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఛార్జింగ్ కోసం థండర్ బోల్ట్ 4 పోర్ట్‌ను కలిగి ఉంది. ఇది ముందుగా ఇన్‌స్టాల్ చేయబడిన విండోస్ 10 తో వస్తుంది.  ఇది విండోస్ 11 ని ఉచితంగా అప్‌డేట్ చేస్తుంది.

సౌండ్: మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం, దీనికి హర్మన్ కంపెనీ నుండి 2 స్పీకర్లు ఉన్నాయి. వీటికి DTS ఆడియో సపోర్ట్ వస్తుంది. వేలిముద్ర సెన్సార్ దాని పవర్ బటన్‌లో ఇచ్చారు.  ల్యాప్‌టాప్ బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో జత చేశారు. అలాగే, PC కనెక్ట్ టెక్నాలజీ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీనితో మీరు మీ ఫోన్‌ని ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోగలుగుతారు.

రియాలిటీ బుక్ ధర దీనిని రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. ఇంటెల్ కోర్ i3 చిప్‌సెట్, 8GB RAM, 256 SSD ఉన్న వేరియంట్ ధర రూ .44,999. అదే సమయంలో, ఇంటెల్ కోర్ i5 చిప్‌సెట్, 8GB RAM, 512GB SSD వేరియంట్ ధర రూ .56,999. వీటిని రియల్ బ్లూ,  రియల్ గ్రే రంగులలో రెండు వేరియంట్‌లను కొనుగోలు చేయవచ్చు. దీని అమ్మకం ఆగస్టు 30 న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. మీరు దీనిని ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ అలాగే ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

Also Read: JioPhone Next: జియోఫోన్ నెక్స్ట్ త్వరలో మార్కెట్ లోకి వచ్చేస్తోంది.. దీని ధర ఎంతో తెలుసా?

Galaxy Z Fold 3: భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌.. ధర అక్షరాల రూ. లక్షన్నర.. అంతలా ఏముందనేగా?