మాంచి కిక్ ఇస్తున్న క్రిస్మస్ ఆఫర్లు.. స్మార్ట్ ఫోన్లపై ఏకంగా రూ. 3000 వరకూ తగ్గింపులు..

| Edited By: TV9 Telugu

Dec 19, 2023 | 7:47 PM

Realme Christmas Sale: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ రియల్ మీ కూడా క్రిస్మస్ సేల్ 2023ని ప్రారంభించింది. దీనిలో తన బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. డిసెంబర్ 18న ప్రారంభమైన ఈ సేల్, 26 వరకూ కొనసాగనుంది. వినియోగదారులు రియల్ మీ అధికారిక వెబ్ సైట్ తో పాటు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో కూడా ఈ డీల్స్ చూడవచ్చు.

మాంచి కిక్ ఇస్తున్న క్రిస్మస్ ఆఫర్లు.. స్మార్ట్ ఫోన్లపై ఏకంగా రూ. 3000 వరకూ తగ్గింపులు..
Realme Christmas Sale 2023
Follow us on

మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పలు ఆఫర్లను కంపెనీ ప్రకటిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్ లతో పాటు గృహోపకరణాలు, వాహనాలపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ రియల్ మీ కూడా క్రిస్మస్ సేల్ 2023ని ప్రారంభించింది. దీనిలో తన బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. డిసెంబర్ 18న ప్రారంభమైన ఈ సేల్, 26 వరకూ కొనసాగనుంది. వినియోగదారులు రియల్ మీ అధికారిక వెబ్ సైట్ తో పాటు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో కూడా ఈ డీల్స్ చూడవచ్చు. వీటిల్లో ఏయే ఫోన్లు ఉన్నాయి? వాటిల్లో ఆఫర్లు ఏంటి? డిస్కౌంట్లు ఎంత? తెలుసుకుందాం రండి..

ఈ ఫోన్లపై ఆఫర్లు..

రియల్ మీ కంపెనీ నుంచి పలు డిమాండ్ ఫోన్లపైనే ఆఫర్లు ఉన్నాయి. రియల్ మీ నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్ మీ నార్జో 60ఎక్స్ 5జీ, రియల్ మీ నార్జో ఎన్55, రియల్ మీ నార్జో ఎన్53 వంటి వాటిపై ఆఫర్లు ఉన్నాయి. రియల్ మీ నార్జో 60ఎక్స్ 5జీ 6జీబీ వెర్షన్ ఫోన్ పై రూ. 1500 కూపన్ తగ్గింపు ఉంది. అదే 4జీబీ వెర్షన్ పై రూ. 1000 వరకూ తగ్గింపును అందిస్తోంది. అలాగే రియల్ మీ నార్జో 60 ప్రో 5జీ 8బీజీ ర్యామ్, 128జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ వేరియంట్లపై రూ. 3000 వరకూ కూపన్ ను లను పొందొచ్చు. అదే విధంగా రియల్ మీ నార్జో 60 ప్రో 12జీబీ, 1టీవీ వేరియంట్ పై రూ. 2000 విలువైన కూపన్ లను అందిస్తోంది.

పూర్తి వివరాలు ఇవి..

  • రియల్ మీ నార్జో 60 ప్రో 5జీ.. 12జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 29,999కాగా, రూ. 2000 విలువైన కూపన్ తో మీరు దీనిని అమెజాన్ లేదా, రియల్ మీ అధికారిక వెబ్ సైట్లో రూ. 27,999కి కొనుగోలు చేయొచ్చు. అదే విధంగా 12జీబీ ర్యామ్, 256జీబీ మెమరీ ఆప్షన్ ఫోన్ ను అసలు ధర రూ. 26,999కాగా దీనిపై రూ. 3000 కూపన్ అందిస్తోంది. దీంతో రూ. 23,999కి కొనుగోలు చేయొచ్చు. ఇక 8జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ ఫోన్ అసలు ధర రూ. 23,999కాగా, రూ. 3000కూపన్ దీనిపై లభిస్తోంది. దీంతో రూ. 20,999కే సొంతం చేసుకోవచ్చు.
  • రియల్ మీ నార్జో 60 5జీ.. 8జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ వేరియంట్ అసలు ధర రూ. 17,999కాగా, రూ. 2500 కూపన్ సాయంతో రూ. 15,499కే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా 8జీబీ ర్యామ్, 256జీబీ మెమరీ వేరియంట్ అయితే అసలు ధర రూ. 19,999కాగా రూ. 2000 వేరియంట్ తో రూ. 17,999కి సొంతం చేసుకోవచ్చు.
  • రియల్ మీ నార్జో 60ఎక్స్ 5జీ.. 6జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ కలిగిన వేరియంట్ ధర రూ. 14,499కాగా దీనిపై రూ. 1500 కూపన్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ ను రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే 4జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర రూ. 12,999కాగా రూ. 1000 కూపన్ తో రూ. 11,999 కి దక్కించుకోవచ్చు.
  • రియల్ మీ నార్జో ఎన్55.. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీ కలిగిన ఈ స్మార్ట్ అసలు ధర రూ, 12,999గా ఉంది. దీనిపై రూ. 3000 కూపన్ లభిస్తుంది. దీంతో రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే 8ఈబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ అసలు ధర రూ, 11,999కాగా, రూ. 2000 కూపన్ తో రూ. 9,999కే కొనుగోలు చేయొచ్చు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..