AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత మార్కెట్‌లోకి క్రేజీ ఫోన్‌ తీసుకొస్తున్న రియల్‌మీ! ధర, ఫీచర్లు ఇవే!

రియల్‌మీ 16x 5G భారత్‌లో త్వరలో విడుదల కానుంది. ఇది 4GB/6GB RAM, 128GB/256GB స్టోరేజ్ వేరియంట్లలో, ఎండ్యూరెన్స్ బ్రౌన్, గ్లోరీ వైట్ రంగుల్లో లభిస్తుంది. పెద్ద డిస్‌ప్లే, డైమెన్సిటీ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అంచనా. దీని ధర రూ.16,999 - రూ.19,999 మధ్య ఉండొచ్చు.

భారత మార్కెట్‌లోకి క్రేజీ ఫోన్‌ తీసుకొస్తున్న రియల్‌మీ! ధర, ఫీచర్లు ఇవే!
Realme 16x 5g
SN Pasha
|

Updated on: Apr 30, 2026 | 4:14 PM

Share

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ భారత మార్కెట్లో తన కొత్త ఫోన్ రియల్‌మీ 16x 5G ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో వెలువడుతున్న లీక్‌లు చూస్తే, ఈ ఫోన్ లాంచ్ చాలా దగ్గరలోనే ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు బయటకు రావడం ఆసక్తిని మరింత పెంచుతోంది. లీక్‌ల ప్రకారం ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 4GB RAM + 128GB స్టోరేజ్, 6GB RAM + 128GB స్టోరేజ్, అలాగే 6GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్లు వినియోగదారులకు ఎంపికగా ఉంటాయి. దీనితో తక్కువ బడ్జెట్ వినియోగదారులతో పాటు మిడ్-రేంజ్ కొనుగోలుదారులను కూడా ఆకర్షించాలనే కంపెనీ వ్యూహం స్పష్టమవుతోంది.

డిజైన్ విషయంలో కూడా రియల్‌మీ కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఈ ఫోన్ ఎండ్యూరెన్స్ బ్రౌన్, గ్లోరీ వైట్ రంగుల్లో రానుందని సమాచారం. మెరిసే బ్యాక్ ఫినిష్‌తో ప్రీమియం లుక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం..రియల్‌మీ 16x 5G లో పెద్ద డిస్‌ప్లే, స్మూత్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే ఆండ్రాయిడ్‌ 16 ఆధారంగా రియల్‌మీ UI కూడా ఉండవచ్చు.

ఈ కొత్త మోడల్ గతంలో వచ్చిన రియల్‌మీ 15x 5G కు సక్సెసర్‌గా రానుంది. 15xలో ఉన్న శక్తివంతమైన బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లను మెరుగుపరిచి కొత్త ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశముంది. ధర విషయానికొస్తే, అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే మార్కెట్ అంచనాల ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.16,999 నుంచి రూ.19,999 మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో మంచి ఫీచర్లు అందిస్తే, భారతదేశంలో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us