Paytm Irctc
ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్ పేటీఎం.. ప్రజలకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ఆటోమేటెడ్ వెండింగ్ మెషీన్ ద్వారా ప్రయాణికులు తమ ట్రైన్ టిక్కెట్‌ను సులభంగా, త్వరగా బుక్ చేసుకోవడానికి పేటీఎంతో చేతులు కలిపింది. పేటీఎం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా గానీ, యూపీఐ ఆప్షన్ ద్వారా గానీ చెల్లించడం ద్వారా ప్రయాణికులు సులభంగా, త్వరగా టిక్కెట్‌లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదిలాఉంటే.. పేటీఎం-ఐఆర్‌సీటీసీ మరో కొత్త సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు ప్రయాణించాలనుకుంటున్న రైలు ఎక్కడుంది? పీఎన్ఆర్ స్టేటస్ ట్రాక్ చేయడం వంటి ఆప్షన్‌ను కల్పిస్తుంది పేటీఎం.
ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్, iOS పేటీఎం వినియోగదారులకు అందుబాటులో ఉంది. రైలును ప్రత్యక్షంగా ట్రాక్ చేయడానికి, పీఎన్ఆర్ స్టేటస్‌ని చెక్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
- ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసి.. ట్రైన్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు పేటీఎం ట్రావెల్ విభాగం ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైలు, బస్సు, విమానాలు వంటి వివరాలను ట్రాక్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది.
- ఇందులో మీరు ట్రైన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ పిఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్, ట్రైన్ క్యాలెండర్, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే ఆప్షన్స్ కనిపిస్తాయి.
- ఇందులో రైలు నెంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ బట్ క్లిక్ చేయాలి.
- సమాచారాన్ని నమోదు చేసిన తరువాత రాబోయే స్టాప్, చివరగా పాస్ అయిన స్టాప్, సమయం, ప్లాట్‌ఫారమ్ వివరాలు, ట్రైన్ ట్రావెలింగ్ టైమ్, మీరు ఉన్న స్టేషన్‌కు ట్రైన్ వచ్చే సమయం సహా అన్ని వివరాలను ఇక్కడ చూపిస్తుంది.
- అదే విధంగా టికెట్ బుకింగ్ స్టేటస్‌ను చెక్ చేయడానికి పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేసి చెక్ చేయొచ్చు.
- అలాగే ట్రైన్ టైమింగ్స్, షెడ్యూల్ వివరాలను కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు.
ATVM ల ద్వారా IRCTC టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి ?..
- మీ సమీప రైల్వే స్టేషన్‌ని సందర్శించాలి. అక్కడ ఉన్న ATVM వద్దకు వెళ్లాలి.
- ATVM లో మీరు ప్రయాణించాలనుకుంటున్న రూట్‌ను ఎంచుకోవాలి.
- ఆ తరువాత మీ చెల్లింపు ఆప్షన్ పేటీఎం యూపీఐని ఎంచుకోవాలి.
- స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
- లావాదేవీ పూర్తయిన తరువాత ఏటీఎం నుంచి భౌతిక టిక్కెట్ వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..