అంగారకుడిపై శబ్దాలను రికార్డ్ చేసిన పర్సెవరెన్స్ రోవర్.. ఈ ఆడియో ద్వారా ఆసక్తికర నిజాలు వెల్లడిస్తున్న సైంటిస్టులు

|

Mar 12, 2021 | 8:48 PM

Parsevar Sending Audio Record on Mars : రెడ్ ప్లానెట్(అంగారకుడి)పై జీవాన్వేషణకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) పంపిన

అంగారకుడిపై శబ్దాలను రికార్డ్ చేసిన పర్సెవరెన్స్ రోవర్.. ఈ ఆడియో ద్వారా ఆసక్తికర నిజాలు వెల్లడిస్తున్న సైంటిస్టులు
Parsevar Sending Audio Reco
Follow us on

Parsevar Sending Audio Record on Mars :  రెడ్ ప్లానెట్(అంగారకుడి)పై జీవాన్వేషణకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) పంపిన పర్సెవరెన్స్ రోవర్ తన తొలి టెస్ట్ డ్రైవ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. గత నెల 18న అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన ఈ రోవర్.. మిషన్‌లో భాగంగా అంగారకుడి ఉపరితలంపై 21.3 ఫీట్ల దూరాన్ని 33 నిమిషాల వ్యవధిలో ప్రయాణించింది. మొదట నాలుగు మీటర్ల దూరం ముందుకు ప్రయాణించి, ఆ తర్వాత 150 డిగ్రీ కోణంలో ఎడమ వైపునకు తిరిగి 2.5 మీటర్లు పయనించినట్లు నాసా పేర్కొంది.

ఇటీవలే నాలుగు మీటర్ల దూరం ముందుకు ప్రయాణించి కుజుడి క్లియర్ ఫొటోలు పంపిన రోవర్.. తొలిసారిగా రెడ్ ప్లానెట్‌పై వినిపిస్తున్న శబ్దాలను రికార్డు చేసి నాసాకు పంపింది. ఈ ఆడియో ద్వారా సైంటిస్టులు అక్కడ ఏ స్థాయిలో గాలులు వీస్తాయనే విషయాన్ని అంచనా వేయనున్నారు. ఈ ఆడియోను ట్విట్టర్‌ వేదికగా షేర్ చేసిన నాసా.. మైక్రోఫోన్‌లో రికార్డ్ అయిన విభిన్న తీవ్రతలతో కూడిన శబ్దాల ద్వారా అక్కడ రాతి శిలలు ఉన్నట్లు భావిస్తోంది. హ్యుమన్ హార్ట్ బీట్‌, లేజర్ స్ట్రెయిక్ సౌండ్స్‌ తరహాలో వినబడుతున్న ఈ శబ్దాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు.

అలాగే భూమికి అవతల సూక్ష్మజీవులు మనగలుగుతాయా? తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇతర గ్రహాలపై అవి మనగలిగే పరిస్థితులు ఉంటే.. అది మానవాళికి ఉపయోగకరం. ఎందుకంటే నిజంగా గ్రహాంతర వాసులు ఉంటే వారి ఆహార పదార్థాలు, వాతావరణంలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రహాలపైకి ఆస్ట్రోనాట్స్ వెళ్లినపుడు వారితో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడ సర్వైవ్ కాగలవా? కాకపోతే అక్కడ కొత్త సూక్ష్మక్రిముల చర్యల ద్వారా ఆస్ట్రోనాట్స్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. రెడ్ ప్లానెట్‌పై సూక్ష్మజీవులు బతికే పరిస్థితులు ఉంటే.. మానవుడికి భూమ్మీద నుంచి ఆహారం తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌ ఇంకా ఈజీ అవడంతో పాటు జీవావరణాన్ని క్షుణ్ణంగా స్టడీ చేయొచ్చు.

మరిన్ని చదవండి: వేసవిలో చెరకు రసంతో సేదతీరండిలా..! ఆరోగ్యపరంగా మహిళలకు చాలా బెన్‌ఫిట్స్.. తెలుసుకోండిలా..
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగం మానేస్తే కంపెనీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. కొత్తగా వచ్చిన విషయం తెలుసుకోండి..