Electric Scooter: వాహన ప్రియుల నిరీక్షణ ముగిసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఒకినోవా తన Okhi 90 కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ వాహన ప్రియులు మెచ్చే అనేక కొత్త ఫీచర్లను(New Features) ఈ స్కూటర్ కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం కింద(FAME Scheme) అందిస్తున్న ప్రోత్సాహకాలు తీసివేసిన తరువాత దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.21 లక్షలుగా ఉంది. ప్రస్తుతం దీనిని కొనాలనుకునే వారి కోసం కంపెనీ ప్రీ బుకింగ్ వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో కూడా వినియోగదారులు దీనిని బుక్ చేసుకునేందుకు అవకాశాన్ని కంపెనీ అందిస్తోంది. లేదా దగ్గరలోని ఏదైనా ఒకినోవా షోరూమ్ ను సందర్శించి కేవలం రూ. 2000 టోకెన్ అమౌంట్ చెల్లించి కూడా దీనిని బుక్ చేసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం దిల్లీలో రూ.1.03 లక్షలు, మహారాష్ట్రలో రూ.1.03 లక్షలు, గుజరాత్ లో రూ.1.01 లక్షలు, రాజస్థాన్ లో రూ. 1.14 లక్షలు, ఒడిశాలో రూ. 1.16 లక్షల రూపాయల ప్రారంభ ధరలో అందుబాటులో బైక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
లేటెస్ట్ ఫీచర్స్.. బెస్ట్ టెక్నాలజీ..
దీని బ్యాటరీ 3.6kWh రిమూవబుల్ లిథియం బ్యాటరీకి 3.8kW ఎలక్ట్రిక్ మోటారు అటాచ్ అయి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో ఎకో, స్పోర్ట్స్ రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. స్పోర్ట్స్ మోడ్ లో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసిన వాహనం 160 కిలోమీటర్లు ప్రయాణించగలదని.. అదే ఎకో మోడ్ లో 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి అదనంగా డిజిటల్ ఎల్ఈడీ లైట్లు, బ్లూచూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఆటోమెటిక్ కీ లెస్ స్టార్ట్, యూఎస్బీ ఛార్జర్ వంటి అదరగొట్టే ఫీచర్లతో ఇది అందుబాటులోకి వస్తోంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు గరిష్ఠంగా 90 కిలోమీటర్లుగా ఉంది. బ్యాటరీని 0 నుంచి 100 వరకు ఛార్జింగ్ చేయటానికి 3 నుంచి 4 గంటల మధ్య సమయం పడుతోందని కంపెనీ వెల్లడించింది. 1.8 సంవత్సరాల పరిశోధన తరువాత దీనిని భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. భారత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దీనిని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించి తయారు చేసినట్లు వెల్లడించింది.
ఇవీ చదవండి..
Snake In Wine Bottle: వైన్ బాటిల్ లో పాము.. సంవత్సరం తరువాత తీసి చూస్తే ఏమైందంటే..