Google translate: ఇంటర్నెట్ లేకుండానే గూగుల్ ట్రాన్స్‌లేట్.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు..
ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచార విప్లవం ఓ రేంజ్‌లో పెరిగింది. నెట్ ఓపెన్ చేస్తే చాలు లెక్కకు మించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో భాష సమాచార మార్పిడికి ఆటంకంగా మారుతుంది. తెలియని భాషలో ఎంత సమాచారం ఉంటే ఏం లాభం చెప్పండి...
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచార విప్లవం ఓ రేంజ్‌లో పెరిగింది. నెట్ ఓపెన్ చేస్తే చాలు లెక్కకు మించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో భాష సమాచార మార్పిడికి ఆటంకంగా మారుతుంది. తెలియని భాషలో ఎంత సమాచారం ఉంటే ఏం లాభం చెప్పండి. ఈ సమస్యకు చెక్ పెట్టిందే గూగుల్ ట్రాన్స్‌లేటర్. ఏ భాషలో ఉన్న సమాచారాన్ని అయినా సరే నచ్చిన లాంగ్వేజ్‌లోకి మార్చుకునే అవకాశం లభించింది. అయితే గూగుల్ ట్రాన్స్‌లేట్ ఉపయోగించాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే.
ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఉపయోగించడం కుదరదు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఒక చిట్కాతో ఇంటర్నెట్ లేకపోయినా ఎంచక్కా ట్రాన్స్‌లేటర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే.. ఇంటర్నెట్ లేకపోయినా సరే ట్రాన్స్‌లేషన్ సేవలను వినియోగించుకునే అవకాశాన్ని కలిపించింది గూగుల్. ఇందుకోసం 33 కొత్త భాషలను ఆఫ్‌లైన్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకొనేలా అప్‌డేట్ అందించింది. అయితే ఇందుకోసం యూజర్లు ముందుగా సదరు భాషల ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ముందుగా ప్లేస్టోర్‌లో గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఆఫ్‌లైన్ ట్రాన్స్‌లేటర్ ఎంచుకుని మీకు కావాల్సిన భాషకు సంబంధించిన ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇందులో పెద్ద ఎత్తున ట్రాన్స్‌లేషన్‌కు సంబంధించి డేటా ఉంటుంది. దీంతో మీకు ఇంటర్నెట్ సదుపాయం లేని సమయంలో ఎంచక్కా ట్రాన్స్‌లేషన్ చేసుకోవచ్చు. తెలియని పదం లేదా వ్యాఖ్యాన్ని ఎంటర్ చేసి ట్రాన్స్‌లేషన్ చేసుకోవచ్చు. ఇలా ఇంటర్నెట్ సదుపాయం లేకుండానే గూగుల్ ట్రాన్స్‌లేట్ సేవలను ఉపయోగించుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..