YouTube: 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే చాలు.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు కిక్కిచ్చే న్యూస్

యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరు ఒక్కరోజైనా యూట్యూబ్ వాడకుండా ఉండలేరు. ప్రతిరోజు కొన్ని లక్షల వీడియోలు ఇందులో అప్‌లోడ్ అవుతుంటాయి. తమ నైపుణ్యాలతో ఎంతోమంది యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లుగా స్థిరపడిపోయారు.

YouTube: 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే చాలు.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు కిక్కిచ్చే న్యూస్
Youtube
Follow us
Aravind B

|

Updated on: Jun 14, 2023 | 8:36 PM

యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరు ఒక్కరోజైనా యూట్యూబ్ వాడకుండా ఉండలేరు. ప్రతిరోజు కొన్ని లక్షల వీడియోలు ఇందులో అప్‌లోడ్ అవుతుంటాయి. తమ నైపుణ్యాలతో ఎంతోమంది యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లుగా స్థిరపడిపోయారు. అయితే ఇందులో డబ్బులు సంపాదించాలంటే ముందుగా మానిటైజేషన్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం 1000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు,  4000 గంటల వీక్షణలు లేదంటే 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్ వ్యూస్ ఉండాలి. కానీ ఇప్పుడు ఇవి అవసరం లేదు. ఎప్పుడెప్పుడు కొత్త కొత్త రూల్స్‌తో వచ్చే యూట్యూబ్ ఈసారి మానిటైజేషన్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకనుంచి కొత్త మానిటైజేషన్‌ నిబంధనల ప్రకారం.. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే సరిపోతుంది. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో మూడు వేల గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్‌ షార్ట్స్‌ వ్యూస్‌ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన వాళ్లు ఇకపై యూట్యూబ్‌ మానిటైజేషన్‌ ప్రోగ్రామ్‌కు అప్లయ్‌ చేసుకోవచ్చు.అయితే ఈ కొత్త మానటైజేషన్‌ నిబంధనల్ని యూట్యూబ్ అమెరికా, బ్రిటన్‌, కెనడా, తైవాన్‌, దక్షిణ కొరియాలో ప్రారంభించింది. త్వరలోనే మిగిలిన దేశాల్లోనూ అమలు చేయనుంది. భారత్‌కు ఎప్పుడు తీసుకొచ్చేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఏది ఏమైన కంటెంట్ క్రియేటర్లకు మాత్రం ఇది కిక్కిచ్చే న్యూస్. ఈ యూట్యూబ్‌ కొత్త రూల్స్‌ వల్ల చిన్న క్రియేటర్లు కూడా తొందరగానే యూట్యూబ్‌ ద్వారా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!