AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccination: ఇకపై వాట్సాప్ లో కూడా మీ సమీపంలోని టీకా కేంద్రాన్ని.. వ్యాక్సిన్ లభ్యతనూ తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..

వాట్సాప్ ద్వారా ఇప్పుడు కరోనా టీకా కేంద్రాలతో పాటు అక్కడ టీకా లభ్యతను సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు.

Corona Vaccination: ఇకపై వాట్సాప్ లో కూడా మీ సమీపంలోని టీకా కేంద్రాన్ని.. వ్యాక్సిన్ లభ్యతనూ తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..
Corona Vaccination
KVD Varma
|

Updated on: Aug 24, 2021 | 12:21 PM

Share

Corona Vaccination:  ఆగస్ట్ 5 న, MyGov,  WhatsApp చాట్‌బాట్ నుండి వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సామర్థ్యాన్ని ప్రవేశపెట్టాయి. దీనిద్వారా ఇప్పటివరకు, 32 లక్షల సర్టిఫికేట్‌లను దేశవ్యాప్తంగా యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ మార్చి 2020 లో ప్రారంభమైనప్పటి నుండి , మహమ్మారి సమయంలో COVID-సంబంధిత సమాచారం తెలుసుకోవడానికి ఉపయుక్తమైన వానరులలో ఒకటిగా అవతరించింది. భారతదేశవ్యాప్తంగా 41 మిలియన్లకు పైగా వినియోగదారుల కోసం ప్రజారోగ్య సంక్షోభంపై పోరాడటంలో కీలకమైన సాధనంగా పనిచేసింది. వాట్సాప్ మంగళవారం తన ప్లాట్‌ఫారమ్‌లోని మైగోవ్ హెల్ప్‌డెస్క్ యూజర్లు తమ సమీప టీకా కేంద్రాన్ని గుర్తించడానికి.. వారి టీకా అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే అంటే ఆగస్ట్ 5 న, MyGov .. WhatsApp చాట్‌బాట్ నుండి టీకా సర్టిఫికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సామర్థ్యాన్ని వినియోగదారులకు పరిచయం చేసింది. దీనిద్వారా ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 32 లక్షల సర్టిఫికేట్‌లు యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

మైగోవ్ సిఇఒ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పౌరులకు ప్రయోజనం చేకూర్చే మార్గాలను అందించిన సాంకేతిక పరిష్కారం అని అన్నారు.  MyGov కరోనా హెల్ప్‌డెస్క్, Haptik, Turn.ioల మద్దతుతో ఇది ప్రారంభించారు. ఇది గో-టు ప్లాట్‌ఫారమ్‌గా అభివృద్ధి చెందింది, ఇది పౌరులకు ప్రామాణికమైన కరోనా-సంబంధిత సమాచారంతో సహాయపడటమే కాకుండా, ఇప్పుడు వారికి ఈ ప్రక్రియలో సహాయపడుతోంది. టీకా బుకింగ్ అంటే టీకా కేంద్రాలు.. స్లాట్‌లను కనుగొనడం.. టీకా సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేయడం, ”అన్నారు. ”ఇది కూడా వాట్సాప్‌లో AI ఆధారిత ఇంటర్‌ఫేస్ ఎనేబుల్ చేసినందువల్ల.. దీనిని నావిగేట్ చేయడం ప్రజలకు సులభంగా మారింది. అందుకే ఇది నిజమైన డిజిటల్ అనుభూతితో పనిచేస్తోంది. ” అని అయన వివరించారు.

” మా సహకారం పౌరులకు స్కేల్‌లో ప్రయోజనాలను విస్తరించే టెక్నాలజీ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేసింది. MyGov కరోనా హెల్ప్‌డెస్క్‌ చాట్‌బోట్ మీద విశ్వాసం ఉంచిన, ప్రయోజనాలను వినియోగించుకున్న పెద్ద సంఖ్యలో వ్యక్తులను బట్టి చూస్తే, డిజిటల్ సాధికారత కలిగిన దేశంగా మారడానికి మా ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన దశ. ” అని అయన చెప్పారు. “ఈ మహమ్మారిపై పోరాడటానికి సహాయపడే మా ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ఒక వేదికగా మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము” అని వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్ అన్నారు.

MyGov కరోనా హెల్ప్‌డెస్క్‌ చాట్‌బాట్‌ను సంప్రదించడానికి, పౌరులు తమ ఫోన్‌లలో WhatsApp నంబర్ +91 9013151515 ను సేవ్ చేయవచ్చు. “బుక్ స్లాట్” అని టైప్ చేయడం ద్వారా చాట్ ప్రారంభించి నంబర్‌కు పంపండి. ఇది సంబంధిత మొబైల్ ఫోన్ నంబర్‌లో ఆరు అంకెల వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు పిన్‌కోడ్, టీకా రకం ఆధారంగా ప్రాధాన్య తేదీ, స్థానాన్ని ఎంచుకోవచ్చు. వినియోగదారులందరూ తమ సెంటర్, వారి టీకా అపాయింట్‌మెంట్ రోజు నిర్ధారణ పొందడానికి ఈ క్రమాన్ని అనుసరించవచ్చు.

Also Read: Maruti Suzuki: మారుతీ కంపెనీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా షాక్.. భారీ జరిమానా విధింపు!

Nirmala Sitharaman: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. నిధుల సమీకరణ కోసం జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌