Viral Video: దెయ్యాన్ని గుర్తించిన గూగుల్ ఎర్త్.. విస్మయం చెందుతున్న నెటిజన్లు.. వీడియో
ఈ చిత్రంలో వంతెన కింద నుంచి భయానక ముఖం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. మనం సినిమాల్లో చూసే భయానక దృశ్యాల్లాగే ఉంది ఇది కూడా. న్యూయార్క్ లోని హైవే వంతెన అయిన కయుగా వాటర్ ఫ్రంట్ ట్రయిల్‌లో జరిగిన ఈ వింత ఘటన ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో వంతెన కింద నుంచి భయానక ముఖం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. మనం సినిమాల్లో చూసే భయానక దృశ్యాల్లాగే ఉంది ఇది కూడా. న్యూయార్క్ లోని హైవే వంతెన అయిన కయుగా వాటర్ ఫ్రంట్ ట్రయిల్‌లో జరిగిన ఈ వింత ఘటన ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చాలామంది చూశారు. కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తు్న్నారు. కొందరు ఈ ముఖం దెయ్యలా ఉందంటే.. మరికొందరు ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకూడదంటూ కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా ఈ వింత రూపాన్ని చూశారు. చాలా మంది దీనిని చూసిన తర్వాత విస్మయం చెందుతున్నారు. వీడియోలో కనిపించే భయానక ముఖం కళ్ళు లోతుగా, నల్లగా కనిపిస్తున్నాయి. ముఖం మొత్తం తెల్లగా కనిపిస్తుంది, పెదవులు ఎర్రగా కనిపిస్తున్నాయి. ఈ అలంకరణ అచ్చం దెయ్యంలా కనిపిస్తుంది. ఆశ్చర్యమేంటంటే.. ఇక్కడ దాని ముఖం తప్ప మరేమీ కనిపించడం లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Galaxy Z Fold, Z Flip: తక్కువ ధరలోనే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ -3 స్మార్ట్ ఫోన్ వీడియో
CM Stalin: 60 ఏళ్లు దాటినా 20 ఏళ్ల తరహాలో.. తమిళనాడు సీఎం స్టాలిన్ వర్కౌట్లు.. వీడియో