Noise earbuds: రూ. 999కే నాయిస్ కొత్త బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటల ప్లేటైమ్.. పూర్తి వివరాలు ఇవీ..

నాయిస్ కంపెనీ నుంచి కొత్త వైర్ లెస్ ఇయర్ బడ్స్ మార్కెట్ లోకి విడుదలయ్యాయి. ఈ కొత్త నాయస్ పాప్ బడ్స్ ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 50 గంటల ప్లే టైమ్ కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. ఈ కొత్త ట్రూ వైర్ లెస్ స్టిరియో (టీడబ్ల్యూఎస్) ఇయర్ బడ్స్ లో క్వాడ్ మైక్ ఈఎన్ సీ టెక్నాలజీని కంపెనీ పరిచయం చేసింది. వినియోగదారులకు రూ.999 ధరలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Noise earbuds: రూ. 999కే నాయిస్ కొత్త బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటల ప్లేటైమ్.. పూర్తి వివరాలు ఇవీ..
Noise Pop Buds
Follow us

|

Updated on: May 04, 2024 | 6:57 PM

ఆధునిక జీవనశైలిలో ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం బాగా పెరిగింది. పనిలో వేగం, సాకర్యం తదితర వాటి కోసం ఇవి తప్పనిసరిగా మారాయి. దానికి అనుగుణంగానే అనేక వస్తువులు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. వాటిలో ఇయర్ బడ్స్ కూడా లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. స్టైల్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, సౌండ్ క్వాలిటీ తో నాయిస్ నుంచి సరికొత్త పాప్ బడ్స్ మార్కెట్ లోకి విడుదలయ్యాయి. వీటి ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

50 గంటల ప్లేటైమ్..

నాయిస్ కంపెనీ నుంచి కొత్త వైర్ లెస్ ఇయర్ బడ్స్ మార్కెట్ లోకి విడుదలయ్యాయి. ఈ కొత్త నాయస్ పాప్ బడ్స్ ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 50 గంటల ప్లే టైమ్ కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. ఈ కొత్త ట్రూ వైర్ లెస్ స్టిరియో (టీడబ్ల్యూఎస్) ఇయర్ బడ్స్ లో క్వాడ్ మైక్ ఈఎన్ సీ టెక్నాలజీని కంపెనీ పరిచయం చేసింది. వినియోగదారులకు రూ.999 ధరలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

మెరుగైన పనితీరు..

వినియోగదారుల ప్రాధాన్యాలతను పరిశీలించి ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను కంపెనీ పరిచయం చేసింది. స్లైల్ తో పాటు నాణ్యమైన పనితీరు కలిగి ఉంటాయి. ఫ్లిప్ టాప్ డిజైన్‌ ఎంతో ఆకర్షణీయం గా కనిపిస్తుంది. స్విచ్‌ను తిప్పడం ద్వారా సులభంగా యాక్సెస్ చేసుకునే వీలుంది. జిమ్‌లో ఉన్నప్పుడు, అవుట్ డోర్ లో వివిధ పనులపై తిరిగినప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా 50 గంటల ప్లే టైమ్ వినియోగదారులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లో నాయిస్ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. మూన్ పాప్, స్టీల్ పాప్, ఫారెస్ట్ పాప్, లిలక్ పాప్ తదితర రంగుల శ్రేణిలో ఆకట్టుకుంటున్నాయి.

ప్రత్యేకతలు..

నాయిస్ పాప్ బడ్స్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిలో 10 ఎమ్ఎమ్ డ్రైవర్లు, క్వాడ్ మైక్ ఈఎన్ సీ (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్) సాంకేతికత చాలా బాగుంది. పాటలు విన్నప్పుడు, గేమ్ ఆడినప్పుడు, సినిమాలు చూసినప్పుడు చాలా స్పష్టంగా మాటలు, మ్యూజిక్ వినడానికి ఇవి ఉపయోగపడతాయి.

వీటిలోని మరో ప్రత్యేకత ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీ. పది నిమిషాల చార్జింగ్ తో సుమారు 150 నిమిషాల వరకు ప్లేటైమ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. హైపర్ సింకా సాంకేతికత మెరుగైన పనితీరును అందిస్తుంది.

నాయిస్ పాప్ బడ్స్ లోని వాటర్ రెసిస్టెన్స్‌ కారణంగా నీరు, చెమట లోపలకు వెళ్లదు. బయట వాతావరణంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు. టైప్ సి ఛార్జింగ్‌తో వేగంగా ఛార్జింగ్‌ చేసుకునే అవకాశం ఉంది.

ఆకట్టుకుంటున్న స్మార్ట్ వాచ్..

నాయిస్ ఇటీవల కలర్ ఫిట్ పల్స్ 4 పేరుతో స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. ఈ వాచ్ రూ. 2,499 ధరకు అందుబాటులో ఉంది. మంచి పిక్సెల్ రిజల్యూషన్,బ్రైట్‌నెస్‌ కలిగిన 1.85 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, డస్ట్, వాటర్ రెసిస్టెంట్, ఏడు రోజుల చార్జింగ్ కెపాసిటీ, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, ట్రూ సింక్ ఎనేబుల్డ్ బ్లూటూత్ కాలింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల హార్ట్ బీట్, నిద్ర విధానాలు, ఒత్తిడి స్థాయిని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. గరిష్టంగా పది నంబర్లను సేవ్ చేసుకోవచ్చు. వందకు పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, వాచ్ ఫేస్‌లను అందిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..