Galaxy S23: రూ. 90 వేల ఫోన్‌ను.. రూ. 45వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 5జీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 89,999కాగా ప్రస్తుతం 47 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 46,999కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు. వీటి ద్వారా గరిష్టంగా రూ. 1250 వరకు డిస్కౌంట్‌ పొందే అవకాశం కల్పించారు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 45 వేలలోపే సొంతం చేసుకోవచ్చు....

Galaxy S23: రూ. 90 వేల ఫోన్‌ను.. రూ. 45వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌
Galaxy S23
Follow us

|

Updated on: May 04, 2024 | 8:50 PM

ప్రముఖ ఈకామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లపై గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ సామ్‌సంగ్‌ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్‌ లభిస్తోంది. గ్యాలక్సీ ఎస్‌23 స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 5జీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 89,999కాగా ప్రస్తుతం 47 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 46,999కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు. వీటి ద్వారా గరిష్టంగా రూ. 1250 వరకు డిస్కౌంట్‌ పొందే అవకాశం కల్పించారు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 45 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 41,000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. గ్యాలక్సీ ఎస్‌23 స్మార్ట్ ఫోన్‌లో 6.1 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ క్వాల్కమ్‌ ఆడ్రినో 740 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ద్వారా 7680 x 4320 పిక్సెల్స్‌తో కూడిన వీడియోను రికార్డింగ్‌ చేసుకోవచ్చు. 30 ఎక్స్‌ వరకు డిజిటల్‌ జూమ్‌ చేసుకునే అవకాశం కల్ఇపంచారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
శ్రీలీల హిట్ కొట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనా..
శ్రీలీల హిట్ కొట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనా..
ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంపు..
ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంపు..
అందం, వయ్యారాలు ఫుల్లు.. కానీ అవకాశాలు మాత్రం నిల్లు..
అందం, వయ్యారాలు ఫుల్లు.. కానీ అవకాశాలు మాత్రం నిల్లు..
రాత్రి సమయంలో అడవిలో కనువిందు చేసే అందాలు.. భారతదేశ మాయా అడవి
రాత్రి సమయంలో అడవిలో కనువిందు చేసే అందాలు.. భారతదేశ మాయా అడవి
రష్యా సైనికుల కాళ్లకు బీహార్ మహిళలు చేసిన బూట్లు..
రష్యా సైనికుల కాళ్లకు బీహార్ మహిళలు చేసిన బూట్లు..
అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్లు వీరే
అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్లు వీరే
నన్ను వదిలేయండి.. పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ సీరియస్..
నన్ను వదిలేయండి.. పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ సీరియస్..
పుచ్చకాయల సాగుతో అదిరిపోయే లాభాలు.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో..
పుచ్చకాయల సాగుతో అదిరిపోయే లాభాలు.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మారిన బెంగళూరు వెదర్ రిపోర్ట్..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మారిన బెంగళూరు వెదర్ రిపోర్ట్..
అర్థరాత్రి కుక్కలను చంపిన కిరాతకుడు.. ఎందుకంటే..?
అర్థరాత్రి కుక్కలను చంపిన కిరాతకుడు.. ఎందుకంటే..?