Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nobel Prize: నానో టెక్నాలజీని అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురష్కారం

ఈ ఏడాది నోబెల్‌ బహుమతి అందుకోబోతున్నారు. నానోటెక్నాలజీలోని అతిచిన్న భాగాలైన క్వాంటమ్‌ డాట్స్‌తోనే LED లైట్లు, టీవీ స్క్రీన్లను తయారు చేస్తున్నారు. భూమి పరిమాణాన్ని ఫుల్‌బాల్‌తో పోల్చితే ఎలా ఉంటుందో, ఒక ఫుల్‌బాల్‌తో పోల్చితే క్వాంటమ్‌ డాట్‌ అంత చిన్నగా ఉంటుంది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో 2023 నోబెల్ బహుమతిని సంయుక్తంగా అందించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టాక్‌హోమ్‌లో తెలిపింది..

Nobel Prize: నానో టెక్నాలజీని అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురష్కారం
Nobel Prize
Follow us
Subhash Goud

|

Updated on: Oct 04, 2023 | 7:28 PM

నానో టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కారణమైన క్వాంటమ్‌ డాట్స్‌ను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయనశాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించారు. మౌంగి బావెండి, లూయిస్‌ బ్రస్‌, అలెక్సీ ఎకిమోవ్‌లకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి అందుకోబోతున్నారు. నానోటెక్నాలజీలోని అతిచిన్న భాగాలైన క్వాంటమ్‌ డాట్స్‌తోనే LED లైట్లు, టీవీ స్క్రీన్లను తయారు చేస్తున్నారు. భూమి పరిమాణాన్ని ఫుల్‌బాల్‌తో పోల్చితే ఎలా ఉంటుందో, ఒక ఫుల్‌బాల్‌తో పోల్చితే క్వాంటమ్‌ డాట్‌ అంత చిన్నగా ఉంటుంది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో 2023 నోబెల్ బహుమతిని సంయుక్తంగా అందించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టాక్‌హోమ్‌లో తెలిపింది.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మౌంగీ జీ. బవెండి, కొలంబియా యూనివర్సిటీకి చెందిన లూయిస్ ఇ. బ్రూస్, నానోక్రిస్టల్ టెక్నాలజీలో పనిచేస్తున్న అలెక్సీ ఐ.ఎకిమోవ్‌లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్‌లు, LED దీపాల నుండి వాటి కాంతిని విడుదల చేస్తాయి. అవి రసాయన ప్రతిచర్యలను ఉత్ప్రేరకపరుస్తాయి. అలాగే వాటి స్పష్టమైన కాంతి సర్జన్ కోసం కణితి కణజాలాన్ని ప్రకాశవంతం చేస్తుందని అకాడమీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

రంగుల కాంతిని సృష్టించేందుకు పరిశోధకులు ప్రధానంగా క్వాంటం చుక్కలను ఉపయోగించారు. భవిష్యత్తులో, క్వాంటం చుక్కలు అనువైన ఎలక్ట్రానిక్స్, చిన్న సెన్సార్లు, సన్నని సౌర ఘటాలు, అలాగే బహుశా ఎన్‌క్రిప్టెడ్ క్వాంటం కమ్యూనికేషన్‌లకు దోహదపడగలవని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు క్వాంటం డాట్‌లు నానోటెక్నాలజీ టూల్‌బాక్స్‌లో ముఖ్యమైన భాగం. కెమిస్ట్రీలో 2023 నోబెల్ బహుమతి గ్రహీతలందరూ నానోవరల్డ్ అన్వేషణలో మార్గదర్శకులని అకాడమీ తెలిపింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేతలను అక్టోబర్ 5న శాంతి బహుమతిని అక్టోబర్ 6న, ఆర్థిక శాస్త్రాల బహుమతిని అక్టోబర్ 9న ప్రకటిస్తారు.

అయితే ఈ నోబెల్‌ బహుమతులను ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కెమిస్ట్రీ.. ఈ ఏడాది ఉమ్మడి రసాయన శాస్త్ర నోబెల్ బహుమతికి వీరిని ఎంపిక చేసినట్లు తెలిపింది. క్వాంటం డాట్‌ల ఆవిష్కరణ, సంశ్లేషణ కోసం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో 2023 నోబెల్ బహుమతిని సంయుక్తంగా అందించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టాక్‌హోమ్‌లో తెలిపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి