
ఫోన్ లేకపొతే ఒక్క క్షణం కూడా తోచదు. ఫోన్ ఉంటే ఇతరులతో అవసరమే లేదు. అంతలా ఫోన్‌లో మునిగిపోతారు. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సిగ్నల్ లేకపోతే కాల్స్ సరిగ్గా మాట్లాడలేం. కాల్స్ కలవడానికి సిగ్నల్ కంపల్సరీ. ఈ వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య సిగ్నల్ అందకపోవడం. ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల కారణంగా సిగ్నల్స్ వీక్‌గా ఉంటాయి. కానీ మొబైల్ సిగ్నల్ సమస్యలను అధిగమించడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అవి పాటిస్తే మీకు సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండదు.
మీ ఫోన్ సిగ్నల్ వీక్‌గా ఉంటే.. ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేసి 10-15 సెకన్ల పాటు అలాగే ఉంచండి. ఆపై దాన్ని మళ్ళీ ఆఫ్ చేయండి. ఇది మీ ఫోన్ నెట్‌వర్క్ కనెక్షన్‌ను రీసెట్ చేయడంలో సహాయపడుతుంది.
మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను చెక్ చేయండి. కొన్నిసార్లు 4G లేదా 5Gకి బదులుగా మీ ఫోన్ 2G లేదా 3G మోడ్‌లో ఉండవచ్చు. సెట్టింగ్‌లకు వెళ్లి, మొబైల్ నెట్‌వర్క్‌పై క్లిక్ చేసి.. 4G లేదా 5Gని ఎంచుకోండి. ఇది సిగ్నల్‌ను మెరుగుపరుస్తుంది. అప్పటికీ పని చేయకపోతే.. మీ ఫోన్ యొక్క ‘నెట్‌వర్క్ మోడ్’ని ‘ఆటోమేటిక్’కి సెట్ చేయండి.
మీ ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పటికీ వైఫై అందుబాటులో ఉంటే.. వైఫై కాలింగ్‌ని ఉపయోగించండి. దీని కోసం.. సెట్టింగ్‌లలో ‘వైఫై కాలింగ్’ ఆప్షన్‌ను ఆన్ చేయండి. మొబైల్ సిగ్నల్ లేకపోయినా మీరు వైఫైతో కాల్స్, నెట్ ఉపయోగించొచ్చు.
మీ మొబైల్‌ను రీస్టార్ట్ చేయడం అత్యంత బెటర్ ఆప్షన్. ఇది మంచి సిగ్నల్ అవకాశాలను పెంచుతుంది. రీస్టార్ట్ చేయడం వల్ల సిగ్నల్ సమస్య పరిష్కారమవుతుంది.
వర్షాకాలంలో మీరు తరచుగా సిగ్నల్ సమస్యలను ఎదుర్కొంటుంటే.. సిగ్నల్ బూస్టర్ కొనడం గురించి ఆలోచించండి.
పాత్ ఫోన్‌లో సిగ్నల్ సమస్యలు ఎదుర్కొంటుంటే.. ‘సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్‌ను చెక్ చేయండి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందుబాటులో ఉంటే ఇన్‌స్టాల్ చేయండి. ఇది ఫోన్ నెట్‌వర్క్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.
కొన్నిసార్లు, సిమ్ కార్డ్ లోపల దుమ్ము లేదా ఇతర శిథిలాల వల్ల కూడా సిగ్నల్ సమస్యలు సంభవించవచ్చు. కాబట్టి సిమ్ కార్డ్‌ను తీసి సాఫ్ట్ క్లాత్‌తో క్లీన్ చేయడానికి ప్రయత్నించండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..