IVR కాల్ అంటే ఏమిటి? ఇదో కొత్త రకం మోసం.. మీకు తెలియకుండానే అకౌంట్ ఖాళీ!
IVR Call: ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనేక రకాల డిజిటల్ మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలను మోసాలు చేసేందుకు నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఫేక్ ఐవిఆర్ కాల్ గురించి మీకు తెలుసా..? ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మరి కొత్త రకం మోసం ఏంటో తెలుసుకుందాం..

ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. అదేవిధంగా స్కామర్లు కూడా టెక్నాలజీ ద్వారా ప్రజలను మోసం చేయడానికి సరికొత్త ప్రణాళికలను రచిస్తున్నారు. ఇటీవల అనేక చోట్ల IVR ద్వారా మోసం కేసులు వెలుగులోకి వచ్చాయి. నకిలీ IVR కాల్స్ ద్వారా ప్రజలు ఎలా మోసపోతున్నారో తెలుసుకుందాం.
IVR వ్యవస్థ అంటే ఏమిటి?
IVR అనేది బ్యాంకులు, టెలికాం కంపెనీలు, కస్టమర్ సర్వీస్ హెల్ప్‌లైన్‌లు ఉపయోగించే ఆటోమేటెడ్ ఫోన్ సిస్టమ్. దీనిలో మీరు మీ ఫోన్ కీప్యాడ్ లేదా వాయిస్ ద్వారా “ఇంగ్లీష్ కోసం 1 నొక్కండి” లేదా “బ్యాలెన్స్ తెలుసుకోవడానికి 2 నొక్కండి, కస్టమర్ కేర్‌తో మాట్లాడటానికి 3 నొక్కండి, అలాగే 9 నొక్కండి” వంటి ఆదేశాలను ఇవ్వడం ద్వారా మీ సేవను ఎంచుకోవచ్చు. ఇది ఐవీఆర్ వ్యవస్థన. స్కామర్లు ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎవరైనా వారు చెప్పిన కీని నొక్కినప్పుడు వారు అతని ఖాతాను ఖాళీ చేస్తారు.
నకిలీ IVR స్కామ్ ఎలా జరుగుతుంది?
IVR కాల్స్ ద్వారా స్కామర్లు ఎవరికైనా కాల్ చేసి బ్యాంకు నుండి వచ్చినట్లు చెప్పుకుంటారు. ఉదాహరణకు, బెంగళూరులోని ఒక మహిళకు జనవరి 20న “SBI” ఉన్న కాలర్ ID చూపించిన కాల్ వచ్చింది. ఆమె అకౌంట్ కూడా SBI బ్యాంకులోనే ఉంది. ఆమె ఖాతా నుండి రూ. 2 లక్షలు బదిలీ అవుతున్నాయని, ఈ లావాదేవీని ఆపాలనుకుంటే, ఆమె కొన్ని బటన్లను నొక్కాలని కాల్‌లో చెప్పింది. ఇది విన్న సదరు మహిళ టెన్షన్ పడి ఆ మహిళ సూచనలను పాటించింది. కాల్ ముగిసిన వెంటనే ఆమె ఖాతా నుండి డబ్బు కట్ అయినట్లు ఆమెకు సందేశం వచ్చింది.
స్కామర్లు IVR ద్వారా మోసం చేసే కొన్ని మార్గాలు ఉన్నాయి.
కాలర్ ID స్పూఫింగ్ – స్కామర్లు కాల్ చేసే నంబర్ బ్యాంక్ లేదా ప్రభుత్వ సంస్థ నిజమైన నంబర్ లాగా కనిపిస్తుంది. అలాగే వాయిస్ క్లోనింగ్ ద్వారా వారి కాల్స్ నిజమైన IVR లాగా వినిపిస్తాయి. దీంతో భయాన్ని సృష్టిస్తారు. అంతేకాకుండా, ఖాతా 2 గంటల్లో బ్లాక్ చేయబడుతుందని లేదా తప్పుడు లావాదేవీ జరిగిందని కాల్స్ ద్వారా భయపెడతారు.
నకిలీ IVRని ఎలా గుర్తించాలి?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు అందుకుంటున్న IVR కాల్ నకిలీదా లేదా నిజమా అని ఎలా గుర్తించాలి. ఒక కాలర్ OTP లేదా CVV అడిగినప్పుడు అది నకిలీ అని అర్థం చేసుకోండి. ఎందుకంటే బ్యాంకు ఉద్యోగులు ఫోన్ ద్వారా మిమ్మల్ని ఎప్పుడూ CVV అడగరు. ఇది కాకుండా అవతలి వ్యక్తి చాలా త్వరగా నిర్ణయం తీసుకోవాలని మీపై ఒత్తిడి తెస్తుంటే, అది కూడా నకిలీ కాల్ కావచ్చు.
ఇది కూడా చదవండి: Cyber Threat: ఎలాంటి క్లిక్ లేకుండా మొబైల్‌ను ఎలా హ్యాక్ చేస్తారు? జీరో-క్లిక్ హ్యాక్ అంటే ఏమిటి?
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








