Gmail: జీమెయిల్ కొత్త అప్ డేట్ అదిరింది.. ఒక్క క్లిక్‌తో ఆ సమస్యకు చెక్.. పూర్తి వివరాలు
అనవసర మెయిల్స్ ఇక రాకుండా ఉండాలంటే వచ్చిన మెయిల్ కింద ఉండే రిపోర్ట్ స్పామ్ అండ్ అన్ సబ్ సబ్ స్క్రైబ్ అనే బటన్ పై ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అయితే జీమెయిల్ ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఓ కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. అలాగే కేవలం ఒక ఆప్షన్ గా ఉన్న ఈ రిపోర్ట్ స్పామ్ అండ్ అన్‌సబ్‌స్క్రయిబ్ ను రెండు ఆప్షన్లుగా మార్చింది. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
జీమెయిల్ ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలో ఉంది. విద్యార్థుల నుంచి బిజినెస్ మ్యాన్ వరకూ అందిరికీ అనివార్యంగా దీనిని వినియోగించాల్సిన పరిస్థితి. స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా జీమెయిల్ ఉండాల్సిందే. ప్రతి ఆన్ లైన్ ప్రక్రియ ఈ జీమెయిల్ ఆధారంగానే పనిచేస్తుంటుంది. అన్నింటికీ జీమెయిల్ ను ప్రాథమికంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక అనవసర ఈమెయిల్స్ మీ జీమెయిల్ ఇన్ బాక్స్ లోకి వచ్చి పడుతుంటాయి. వాటిల్లో చాలా ప్రమోషనల్ మెయిల్స్ కూడా ఉంటాయి. అటువంటి అనవసర మెయిల్స్ ఇక రాకుండా ఉండాలంటే వచ్చిన మెయిల్ కింద ఉండే రిపోర్ట్ స్పామ్ అండ్ అన్ సబ్ స్క్రైబ్ అనే బటన్ పై ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అయితే జీమెయిల్ ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఓ కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. కేవలం ఒక ఆప్షన్ గా ఉన్న ఈ రిపోర్ట్ స్పామ్ అండ్ అన్‌సబ్‌స్క్రయిబ్ ను రెండు ఆప్షన్లుగా మార్చింది. అంటే రిపోర్ట్ స్పామ్ ఒక ఆప్షన్, అన్‌సబ్‌స్క్రయిబ్ పేరిట మరో ఆప్షన్ కింద విభజించింది. ఒక్క క్లిక్ తో అవాంఛిత మెయిల్స్ రాకుండా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎందుకు ఈ ఫీచర్..
జీమెయిల్ మొబైల్, వెబ్ వెర్షన్‌లలో ఈమెయిల్‌లకు సబ్ స్క్రిప్షన్ తీసివేయడాన్ని గూగుల్ ఇప్పుడు మరింత సులభతరం చేస్తోంది. గూగుల్ వర్క్ స్పేస్ లో ఈ కొత్త అప్ డేట్ గురించి వివరించింది. అవాంఛిత ఈ మెయిల్‌లను నిర్వహించడం చాలా మంది వినియోగదారులకు ఇబ్బందులకు గురిచేస్తుందని.. అందుకే వినియోగదారులు సురక్షితంగా ఉండటంలో సహాయపడేందుకు తాము కొన్ని నెలల క్రితం బల్క్ మెయిల్స్ పంపేవారి కోసం కొత్త మార్గదర్శకాలను ప్రకటించినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ క్రమంలో వెబ్, మొబైల్‌లో జీమెయిల్ లోని అవాంఛిత ఈమెయిల్‌ల నుండి సబ్ స్క్రిప్షన్ తీసివేయడాన్ని మరింత సులభతరం చేయడానికి తాము కొత్త మార్గాలను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.
వెబ్ వెర్షన్ జీమెయిల్ అకౌంట్ అన్‌సబ్‌స్క్రైబ్ బటన్‌ను ప్రత్యేకంగా ఇచ్చింది. థ్రెడ్ లిస్ట్‌లోని హోవర్ యాక్షన్స్ వద్దకు దీనిని తరలిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అన్‌సబ్‌స్క్రైబ్ బటన్‌ను క్లిక్ చేయగానే మెయిలింగ్ చిరునామా నుంచి వినియోగదారు చిరునామాను తీసివేయడానికి మెయిల్ పంపినవారికి ఈమెయిల్‌ను పంపుతుంది. అలాగే వినియోగదారు ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలలో ఈ అన్ సబ్ స్క్రైబ్ ఆప్షన్ మరింత ప్రముఖంగా కనిపించడానికి మూడు-చుక్కల మెనుకి తరలించింది.
ఇకపై అన్ సబ్ స్క్రైబ్ లింక్ ఉండాల్సిందే..
9టు5 గూగుల్ నివేదిక ప్రకారం, బల్క్ ఈమెయిల్స్( 5000 కన్నా ఎక్కువ) పంపే సంస్థలు తప్పనిసరిగా ఇకపై వన్-క్లిక్ అన్‌సబ్‌స్క్రైబ్ లింక్‌ను వారి మెసేజ్ తో పాటు వినియోగదారులకు పంపాలి. 2024, ఫిబ్రవరి నుంచి ఇది తప్పనిసరిగా అమలు చేయాలి. ఈ వన్-క్లిక్ అన్‌సబ్‌స్క్రైబ్ లింక్ కూడా మెసేజ్ బాడీలో ప్రముఖంగా కనిపించే విధంగా ఇవ్వాలి. ఆ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారు వద్దనుకున్న మెయిల్స్ ఇక రాకుండా నియంత్రించొచ్చు. ఈ అభ్యర్థనను మెయిల్ సెండర్ రెండు రోజులలోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఇది జీమెయిల్ వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..