- Telugu News Photo Gallery Technology photos Motorola offering discount on Moto G54 smart phone, Check here for latest price
Moto G54: రూ. 13వేలకే 5జీ స్మార్ట్ ఫోన్..మోటో జీ54పై భారీ డిస్కౌంట్..
ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. దేశంలో 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న వేళ కంపెనీలు వరుసగా 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. మొదట్లో భారీగా ఉన్న 5జీ ఫోన్‌లు తర్వాత భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందించింది. ఇంతకీ ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభించనుందంటే..
Updated on: Jan 23, 2024 | 10:27 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో జీ54పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మోటో జీ54 బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 15,999గా ఉండగా తాజాగా ఏకంగా రూ. 3వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

దీంతో ఈ ఫోన్‌ను రూ. 12,999కే సొంతం చేసుకునే అవకాశం లభించింది. ఇక 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ తర్వాత రూ.15,999లకు లబిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుందనే దానిపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోణ్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ -13 విత్ మై యూఎక్స్ 5.0 వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీని ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. ఛార్జింగ్ విషయానికొస్తే.. 33వాట్ల టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.




