
భారతీయులకు టీవీలకు ఓ అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా గ్రామీణులకు టీవీలో సీరియల్స్ చూడకపోతే ఏదో వెలితిగా ఫీలవుతుంటారు. అయితే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా టీవీ తయారీలో వస్తున్న మార్పులు కారణంగా స్మార్ట్‌టీవీలు మార్కెట్‌లో హవా చూపుతున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పని చేసే స్మార్ట్ టీవీలు ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. అలాగే స్మార్ట్‌టీవీల్లో వచ్చే వివిధ యాప్స్ కారణంగా వారు చూడాల్సిన కార్యక్రమాలు వారికి ఖాళీ ఉండే సమయాల్లోనే చూసే వెసులుబాటు ఉండడంతో అందరూ స్మార్ట్‌టీవీలు కొనుగోలు చేస్తున్నారు. అనూహ్యంగా స్మార్ట్‌టీవీలకు డిమాండ్ ఏర్పడడంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ నయా ఫీచర్స్‌తో కొత్త మోడల్స్ స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ బ్లౌపంక్ట్ రెండు స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. 43 అంగుళాల క్యూఎల్‌ఈడీ టీవీతో పాటు 55 అంగుళాల గూగుల్ టీవీలను రిలీజ్ చేసింది. సన్నటి ఫ్రేమ్‌తో డిస్ప్లేలు, డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10 ప్లస్‌తో ఆకర్షణీయంగా ఉంటుది. బ్లౌపంక్ట్ టీవీలపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
43 అంగుళాల బ్లౌపంక్ట్ క్యూఎల్‌ఈడీ టీవీ ధర రూ.28,999గా ఉంది. అలాగే 55 అంగుళాల మోడల్ ధర రూ.34,999గా నిర్ణయించారు. ముఖ్యంగా ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపుతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీలు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీల ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..